లోకేష్ తోడ‌ళ్లుడా... బాల‌య్య చిన్న‌ల్లుడా.. ఓ శ్రీ భ‌ర‌త్ ఏంట‌య్యా ఈ క‌ష్టాలు..?

praveen
తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీ ప్యాకేజ్‌లో భాగంగా సీటు వ‌రుస‌గా రెండోసారి కొట్టేశాడు గీతం విద్యాసంస్థ‌ల చైర్మ‌న్ శ్రీ భ‌ర‌త్‌. విశాఖ ఎంపీ సీటు కోసం బీజేపీ, జ‌న‌సేన‌తో పాటు టీడీపీలోనూ గ‌ట్టి పోటీ ఉన్నా కేవ‌లం నారా, నంద‌మూరి కుటుంబాల‌కు కావాల్సిన వాడ‌నే ఆయ‌న‌కు వ‌రుస‌గా రెండోసారి సీటు ఇచ్చారు. సీటు అయితే తెచ్చుకున్నాడే కాని.. ఇక్క‌డ గెల‌వ‌డం సంగ‌తేమో గాని భ‌ర‌త్‌కు చెమ‌ట‌లు ప‌ట్టి చొక్కాలు త‌డిసిపోతున్నాయ్‌.
బొత్స ఝాన్సీ విజ‌య‌న‌గ‌రం వాసి త‌న‌కు పోటీ ఏంట‌నుకున్న భ‌ర‌త్‌కు ఇప్పుడు విశాఖ లోక‌ల్ ఆడ‌ప‌డుచుగా, బీసీ మ‌హిళ‌గా.. ఇటు మంత్రి విశాఖ పార్ల‌మెంటుపై ప‌ట్టున్న బొత్స స‌త్య‌నారాయ‌ణ భార్య‌గా ఆమె దూసుకుపోతున్నారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ ఝాన్సీకి సానుకూల వాతావ‌ర‌ణం పెరుగుతోంటే ఇటు భ‌ర‌త్‌కు వ‌రుస‌గా ఇక్క‌ట్లు త‌ప్ప‌డం లేదు. ఎన్నిక‌ల‌కు నాలుగు రోజుల ముందు భ‌ర‌త్‌పై ఉన్న కేసులు సెక్ష‌న్ల‌తో పాటు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డం తెలుగుదేశం శ్రేణుల‌కు అస్స‌లు మింగుడు ప‌డ‌డం లేదు. బెంగ‌ళూరులోని దొడ బ‌ళ్లాపుర స్టేష‌న్లో న‌మోదైన కేసుల సెక్ష‌న్లు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి.
చంద్ర‌బాబు ఏమో ఫుల్ ధీమాతో భ‌ర‌త్‌కు సీటు ఇస్తే ప‌క్క‌గా జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మితో గెలుస్తాడ‌నే లెక్క‌లు వేసుకుని ఆ రెండు పార్టీల అధిష్టానాల‌తో పెద్ద పోరాటాలు చేసి మ‌రీ టిక్కెట్ ఇప్పించుకున్నాడు. అక్క‌డ‌కు బాల‌య్య‌, లోకేష్ ఒత్తిడి కూడా ఈ సీటు విష‌యంలో చాలానే ఉంది. దీనికి తోడు విశాఖ‌లోనే కాదు కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌లోనూ త‌క్కువ రేటుకే ఫ్యాక్ట‌రీలు, ప‌రిశ్ర‌మ‌ల పేరుతో ప్ర‌భుత్వ భూముల‌ను కైవ‌సం చేసుకున్న విష‌యాలు కూడా ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో టీడీపీ కేడ‌ర్‌ను, ఇక్క‌డ పార్ల‌మెంటు ప‌రిధిలో టీడీపీ నుంచి పోటీ చేస్తోన్న అసెంబ్లీ అభ్య‌ర్థుల‌ను సైతం బెంబేలెత్తిస్తున్నాయి.
ఇవ‌న్నీ ఇలా ఉంటే రెండు నెల‌ల ముందు పార్ల‌మెంటు ప‌రిధిలోని 7 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ కూట‌మి స్వీప్ అన్నారు. కాని స్టిల్ ఈ రోజుకు చూస్తే నార్త్‌, సౌత్‌, వెస్ట్‌లో వైసీపీకి గెలిచే ఛాన్సులు పుష్క‌లంగా ఉన్నాయి. ఇక ఎస్ కోట ఎలాగూ వైసీపీకి కంచుకోటే అయ్యేలా ఉంది. ఇక కూట‌మికి గ‌ట్టిగా ఆశ‌లు భీమిలి, గాజువాక‌లో ఉండగా ఈస్ట్‌లోనూ గ‌ట్టి పోటీ ఉంది. ఇక పార్ల‌మెంటు ప‌రిధిలో ఏకంగా 4 చోట్ల గెలుపు అంటే ఇక పార్ల‌మెంటు సీటు గ‌ల్లంతేనా అన్న సందేహాలు కూడా టీడీపీ వాళ్ల‌లో వ‌చ్చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: