టీడీపీ నేతల దాడిలో పిన్నెలి భార్యకు గాయాలు.. ఓటమి ఫ్రస్టేషన్ తో ఇలా చేస్తున్నారా?

Reddy P Rajasekhar
ఏపీలో సరిగ్గా ఎన్నికల సమయంలో వైసీపీ మహిళా నాయకులపై జరుగుతున్న దాడులు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. హోంమంత్రి తానేటి వనతిపై గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో దాడి జరిగిన ఘటనను మరవక ముందే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై కూడా దాడి జరగడం హాట్ టాపిక్ అవుతోంది. ఓటమి ఫ్రస్టేషన్ తో టీడీపీ నేతలు ఇలా చేస్తున్నారా? అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారని వృద్ధుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో వైసీపీ ఏజెంట్లపై టీడీపీ ఏజెంట్లు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. వైసీపీ ఏజెంట్లపై టీడీపీ ఏజెంట్లు రాళ్లతో దాడి చేయడంతో ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. సిరిగిరిపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిరిగిరిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే భార్య రమాదేవిపై కూడా టీడీపీ నేతలు దాడి చేసినట్టు తెలుస్తోంది.
 
ఈ ఘటనలో రమాదేవి వాహనాలు సైతం ధ్వంసం అయ్యాయని సమాచారం అందుతోంది. వెల్దుర్తి ఎస్సై శ్రీహరి దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆయనపై కూడా దాడి జరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహిళలపై టీడీపీ వరుస దాడులపై వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు. ఈ దాడుల గురించి చంద్రబాబు, టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని కామెంట్లు చేస్తున్నారు.
 
విజయవాడలో బోండా ఉమ అనుచరులు వైయస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై దాడి చేయడం, అంతకుముందు మంత్రి బాలినేని కోడలుపై ఒంగోలులో దాడి చేయడం లాంటి ఘటనలను మరవకముందే రాష్ట్రంలోని మహిళలపై మరిన్ని దాడులు జరుగుతుండటం గమనార్హం. ఎన్నికల సమయంలో ఇలాంటి దాడుల వల్ల కూటమి నేతలకు వచ్చే ఓట్లు కూడా రావని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహిళల విషయంలో బాబు, టీడీపీ నేతల తీరు మారకపోతే కూటమి తీవ్రస్థాయిలో నష్టపోయే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: