ఉత్సాహంగా ఉల్లాసంగా...30 సంవత్సరాల ఆత్మీయ సమ్మేళనం!

Thota Jaya Madhuri
*గురుకుల పాఠశాలకు రూ. 70. వేల విలువైన పుస్తకాలు, స్పోర్ట్స్ కిట్ ఇవ్వాలని నిర్ణయం

*పదోతరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించాలని నిర్ణయం.

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల( బిసి) శ్రీశైలం1994-1995 పదవ తరగతి విద్యార్థుల 30 సంవత్సరాల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా ఉల్లాసంగా కర్నూల్ లో జరిగింది.. నగరంలోని కె.వి.ఆర్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప చిత్తూరు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ బృందంతో పాటు, పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై సమావేశానికి నూతన ఉత్తేజాన్ని కలిగించారు..30 సంవత్సరాల తర్వాత మిత్రులు కలవడంతో ప్రతి ఒక్కరిలోనూ ఆనందం నెలకొంది.. తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో పాటు, పాఠశాలలో జరిగిన అనేక సంఘటనలను స్మరించుకున్నారు. ఉదయం సుప్రదాయ వాయిద్యాలతో ఉపాధ్యాయులకు ఘనంగా స్వాగతం చేశారు. పాఠశాల జెండాలను ఆవిష్కరించారు.. పదవీ విరమణ చెందిన ప్రిన్సిపల్ అసూయమ్మ, దామోదరం, దేవదానం, రామ్మూర్తి, ఎస్ ఎం భాష, విజయ లక్ష్మి , సి.వి రమణ, చంగమ నాయుడు, నారాయణస్వామి తదితర ఉపాధ్యాయ బృందంతో పాటు ప్రస్తుత కాలువ బుగ్గ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీలను శాలువా పూలమాలలతో సత్కరించి, మొమెంటోలతో ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ 30 సంవత్సరాల తర్వాత ఈ ఆనందాన్ని పంచుకోవడం తమకు ఎంతో సంతోషకరంగా ఉందని, జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను గౌరవించడంతోపాటు, గురువులను గౌరవిస్తూ, పనిచేసే రంగాలలో నీతి నిజాయితీగా ఉండి నలుగురికి సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని, ఆయా రంగాలలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఉపాధ్యాయులు సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుగా కూడా నిర్వహించాలని వారు ఆకాంక్షించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల (బి.సి)లకు సుమారు రూ.70 విలువైన పుస్తకాలు, స్పోర్ట్స్ కిట్, అలాగే ప్రతి యేటా పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం ఉండేలా ... ప్రథమ స్థానం వారికి vరూ.10,116, ద్వితీయ స్థానం వారికి రూ.7116, తృతీయ స్థానం వారికి రూ.5116 లు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక వేళ సమానంగా మార్కులు వస్తే లాటరీ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేసి... నగదు బహుమతి పాఠశాల ప్రిన్సిపాల్ చేతుల మీదుగా అందజేస్తామని కె.లక్ష్మణచారి, బి.శివనాగరాజు, వి.నారాయణ, వడ్డె మారెన్న ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ఈ నగదు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిర్వాకులు నాగ శేషులు, టి.ఎల్.నరసింహులు, విజయ , అరుణ , శ్రీరాములు, 108 శీను, వి. బాలరాజు, వంశీ, ఎం.నరసింహులు, కృష్ణ నాయక్, మాధవ కృష్ణ, రవీంద్ర, నాగార్జున తదితరులు పాల్గొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: