"ఆ రోజు ఈ సో కాల్డ్ స్టార్స్ ఎక్కడికిపోయారు..?"..మీడియా ముందే అడిగి కడిగేసిన శివాజీ..!
తన వ్యాఖ్యల కారణంగా తన భార్య, పిల్లలు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని శివాజీ చెప్పారు. “నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. గతంలో నేను ఎప్పుడూ నియంత్రణ కోల్పోయి మాట్లాడలేదు. 30 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలో ఉన్నాను. కానీ ఇలాంటి వివాదం నా జీవితంలో ఇదే మొదటిసారి” అని ఆయన అన్నారు.
ఈ వివాదంపై మరింతగా స్పందించిన శివాజీ, “నేను అమరావతి రైతుల కోసం పోరాడాను. కానీ ఈ విషయంలో నా వైపు పొరపాటు జరిగింది. ఆ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే వారు నన్ను రావాలని పిలిచారు. నేను తప్పకుండా వెళ్తాను, నా వివరణను ఇస్తాను” అని అన్నారు.భారత రాజ్యాంగం హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఇచ్చిందని గుర్తుచేసిన ఆయన, ప్రొవోకింగ్ కూడా ఒక నేరమేనని అభిప్రాయపడ్డారు. “డ్రెస్‌లు వేసుకోవడం పూర్తిగా వారి ఇష్టం. నేను ఎవరికీ ఆ విషయంలో చెప్పే హక్కు లేదు. ఎవరి హక్కులను నేను హరించాలనుకోలేదు” అని స్పష్టం చేశారు.
నిధి అగర్వాల్ విషయంలో మాట్లాడుతూ, “ఆమె కోసం మహిళల్లో ఎవరైనా మాట్లాడారా? నేను మాట్లాడాను. ఆమె బయట నుంచి వచ్చిన అమ్మాయి. మనం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. సమాజంలో ఏదైనా తప్పు జరిగితే నేను మాట్లాడతాను” అని అన్నారు. అయితే తన వ్యాఖ్యలకు ముందు చాలా విషయాలు జరిగాయని, వాటిపై ఎందుకు ఎవరూ మాట్లాడలేదని ప్రశ్నించారు.తన ఉద్దేశం మంచిదైనా, వాడిన ఆ రెండు పదాలు మాత్రం తప్పేనని శివాజీ అంగీకరించారు. “నేను తప్పు చేస్తే సారీ చెప్పడానికి ఎప్పుడూ వెనకాడను” అని అన్నారు. ఈ సందర్భంగా నటి అనసూయపై కూడా స్పందిస్తూ, “అనసూయ ఈ ఇష్యూలోకి ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు. నాకు ఇన్‌సెక్యూరిటీ ఉందన్నారు, ధన్యవాదాలు. నాకు మా హీరోయిన్స్ ఇబ్బంది పడతారనే ఇన్‌సెక్యూరిటీ ఉంది” అని వ్యాఖ్యానించారు.
అనసూయకు తన రుణం తీర్చుకుంటానని, ఆమె వ్యాఖ్యలను సానుకూలంగా తీసుకుంటున్నానని శివాజీ తెలిపారు. తాను క్షమాపణలు చెప్పిన తర్వాత ఎంతోమంది తనకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. “నా ఉద్దేశం ఒక్కటే – ఆడపిల్లలను రక్షించుకోవాలి. వారి భద్రత కోసం మాట్లాడాలనేదే నా ఆలోచన” అని శివాజీ స్పష్టం చేశారు.మొత్తంగా ఈ వివాదంపై పూర్తి బాధ్యత తనదేనని అంగీకరిస్తూనే, తన మాటలను తప్పుగా అర్థం చేసుకోకుండా తన అసలు ఉద్దేశాన్ని కూడా ప్రజలు గుర్తించాలని నటుడు శివాజీ కోరారు. అయితే కొంత మంది కావాలనే శివాజీ ని టూ బ్యాడ్ చేసి మాట్లాడుతున్నారు అంటున్నారు ఆయన ఫ్యాన్స్. తప్పు చేశాడు సారీ చెప్పాడు ఇంక ఎందుకు ఈ రాద్ధాంతం అంటున్నారు. ఇప్పుడు నోర్లు తెరిచి అరిచే వాళ్ళు నిధి విషయంలో ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు.