నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే.. "దానం" వ్యాఖ్యలపై స్పీకర్ రియాక్షన్ ఏంటో.?

Pandrala Sravanthi
గత కొద్దిరోజులుగా తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పార్టీ ఫిరాయింపుల విషయంలో రచ్చ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉంటున్న వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ పిటిషన్ పై స్పీకర్ తమ నిర్ణయం ఏంటో చెప్పాలని కోర్టు చెప్పడంతో చివరికి స్పీకర్ ఓ నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ లోని ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టు ఎలాంటి ఆధారాలు లేవు అని కొట్టిపారేశారు. అందులో తెల్లం వెంకట్ రావు, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి లు కాంగ్రెస్ లో చేరినట్టు ఆధారల్లేవని,వారిపై వచ్చిన అనర్హతా పిటిషన్ ని కొట్టిపారేశారు. ఇక మిగిలిన ఐదుగురి ఎమ్మెల్యేలకు సంబంధించిన నిర్ణయాన్ని స్పీకర్ ఇంకా బయట పెట్టలేదు. 


అయితే స్పీకర్ తన నిర్ణయాన్ని బయట పెట్టక ముందే ఖైరతాబాద్ ఎమ్మెల్యే లో బీఆర్ఎస్ తరఫు నుండి గెలుపొందిన ఎమ్మెల్యే దానం నాగేందర్ నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దానం నాగేందర్ మాట్లాడుతూ ..నేను పక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేని.. ఇందులో ఎలాంటి డౌటు లేదు.వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల్లో హైదరాబాదులో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఎంఐఎం తో కలిసి ఎన్నికల కోసం పర్యటించి నగరంలోని దాదాపు 300 డివిజన్లో నేను ప్రచారం చేస్తా.. కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులో బలోపేతం కావడం కోసం మొత్తం కలియతిరిగి బలోపేతం చేస్తా.. కాంగ్రెస్ మాత్రమే కాదు మిత్రపక్షంలో ఉన్న ఎంఐఎం గెలుపు కోసం కూడా నేను ప్రచారం చేస్తా.. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రెండు పార్టీలు ఘన విజయం సాధిస్తాయి.


మిగతా ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే నా ప్రయాణాన్ని కొనసాగిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దానం నాగేందర్. అయితే పార్టీ ఫిరాయింపుల కేసు విషయంలో దానం నాగేందర్ పేరు కూడా ఉంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున గెలిచారు.అలాంటిది నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పుకోవడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. అంతే కాదు స్పీకర్ దానం నాగేందర్ విషయంలో ఏ విధంగా స్పందిస్తారు అనే ఆసక్తి కూడా చాలామందిలో పెరిగిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు ఐదుగురు ఎమ్మెల్యేలలో కాంగ్రెస్లో చేరినట్టు ఆధారాల్లేవని చెప్పారు. కానీ ఇప్పుడు దానం నాగేందర్ మాత్రం స్వయంగా ఆయనే నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పుకోవడంతో స్పీకర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: