పెళ్లి వద్దు కానీ అది కావాలి అంటున్న జాతి రత్నాలు హీరోయిన్..!?

Anilkumar
జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది బ్యూటీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో తనకి వరుస సినిమాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలు వచ్చాయి. అలా వచ్చిన సినిమాలు అన్నిటికీ గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ  ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈ సినిమా సైతం మంచి విజయాన్ని అందుకుంది ప్రస్తుతం థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే సినిమా యావరేజ్ గా ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం బాగానే వసూలు చేస్తుంది అని చెప్పాలి. అయితే ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఇంటర్వ్యూలో భాగంగా పలు షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ఇక ఇంటర్వ్యూలో ఆమె తనకి సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంది. అలాగే తనకు పెళ్లిపై హోప్ లేదు కానీ..

 పిల్లలు మాత్రం కావాలంటూ చెప్పుకొచ్చింది.. ఇటీవల ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ.. ‘నా మ్యారేజ్ పైన నాకు హోప్ కూడా లేదు. ఒకవేళ అయితే అవ్వోచ్చు. కానీ కచ్చితంగా నేను పెళ్లి చేసుకోవాలి అని అయితే నాకు లేదు. కానీ నాకు పిల్లలు అంటే మాత్రం చాలా ఇష్టం.. అయితే అమ్మ అవుతాను.. పెళ్లి గురించి ఆలోచించాలి అని చెప్పుకొచ్చింది.. అయితే తండ్రి బాధ్యతలు కూడా ఉండాలి. ఒక చైల్డ్‌ని తల్లీతండ్రి ఇద్దరు కలిసే పెంచాలి. దాంట్లో నాకు డౌట్ లేదు.. కానీ పెళ్లి అనేది ఆలోచించాలి అని చెప్పింది.. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: