కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రమ్యకృష్ణ..!?

Anilkumar
స్టార్ హీరోయిన్ల నుండి మొదలు పెడితే జూనియర్ ఆర్టిస్టుల వరకు సినీ ఇండస్ట్రీలో అందరికీ లైంగిక వేధింపులు ఉన్నాయి అని చాలామంది ఇప్పటికే పలు రకాల ఇంటర్వ్యూస్ లో వెల్లడించారు. అయితే తాజాగా ఇప్పుడు ఆ లిస్టు లోకి చేరారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ. అయితే రమ్యకృష్ణ సైతం కాస్టింగ్ కావచ్చు గురించి నోరు విప్పారు. అయితే 1990లో తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది ఈమె. దాదాపుగా ఇప్పటివరకు ఉన్న అందరి స్టార్ హీరోల సినిమాల్లో ఆడి పాడింది ఈమె. అయితే నిత్యం సోషల్ మీడియాలో కాస్టింగ్ కౌచ్ గురించి ఏవో ఒక వార్తలు వినబడుతూనే ఉంటాయి. ఎవరో ఒకరు తమకు ఎదురైన చేదు

 అనుభవం గురించి మీడియా ముందుకి వచ్చి నోరు విప్పుతూ ఉంటారు. ఇక మరికొందరు అయితే సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్టులు పెడుతూ తమకి ఎదురైనా చేదు అనుభావాల గురించి మాట్లాడతారు. తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి ఇప్పటికీ చాలామంది హీరోయిన్స్ సైతం నోరు విప్పారు. అయితే రమ్యకృష్ణ కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వయసు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది .అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన ఈమె ఇప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తోంది. కాగా ఇటీవల రమ్యకృష్ణ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కనిపించింది. ఈ క్రమంలోని రమ్యకృష్ణ క్యాస్టింగ్ కౌచ్ గురించి

 షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ ఉంటుందని అన్నారు రమ్యకృష్ణ. అయితే సెలబ్రిటీలే ఎక్కువగా తెరపైకి రావడంతో అందరూ ఇండస్ట్రీ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. కొంతమంది దాన్ని ప్రచారం చేస్తూ హడావిడి చేస్తున్నారు. సినిమా ల్లో స్టార్‌గా ఎదగాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందేనని అన్నారు రమ్యకృష్ణ. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: