ఏపీ: నోరూరిస్తున్న జగన్ ప్రమాణస్వీకారం రోజు మెనూ..??

Suma Kallamadi
ఏపీ సీఎం జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని నమ్మడంలో తప్పులేదు. ఎందుకంటే ఆయన 5 ఏళ్ల కాలంలో చాలానే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు అభివృద్ధి పరంగా కూడా చంద్రబాబు అంటే ఎక్కువే చేశారు. రాబోయే ఐదేళ్లలో ఏపీని మరింత అభివృద్ధి చేస్తానని, పేద ప్రజల భవిష్యత్తు మార్చేస్తానని జగన్ అంటున్నారు. దీనివల్ల ఆయన రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదని అనవచ్చు. జూన్ 9వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఆల్రెడీ ఏర్పాట్లు చేసుకుంటున్నారట. లెక్కింపు ఇంకా పూర్తికాకముందే ఇలా ఏర్పాట్లు చేయడం ఏంటని వెక్కిరించాల్సిన అవసరం కూడా లేదు.
 ఈ క్రమంలోనే మరొక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది అదేంటంటే ప్రమాణ స్వీకారం నాటి ఈవెంట్ నిర్వహించడానికి ఒక కమిటీ ఏర్పాటు అయిందట. ఆ కమిటీకి ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ఛైర్మన్ అని అంటున్నారు. వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ ప్రోగ్రామ్‌ అనే పేరుతో ఒక కమిటీ ఏర్పాటు కాబోతోందని ప్రస్తుతం వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఉదయం పూట జగన్ ప్రమాణస్వీకారం జరగని ఉందని అంటున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసే వారందరికీ ఒక దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన టిఫిన్లను, భోజనాలను వడ్డించాలని వైసీపీ నిర్ణయించిందట.
 వారి ప్రకారం బ్రేక్ ఫాస్ట్ లో మసాలా ఇడ్లీ, ఎమ్మెల్యే పెసరట్టు, జీడిపప్పు ఉప్మా, పులిహోర, పెరుగు వడ, సాంబార్ వడ, మసాలా వడ, చక్కెర పొంగలి, పోహా వేపుడు, పాయసం, చాక్లెట్ దోశ, బొబ్బట్లు, ఆంధ్ర స్వీట్లు, పునుగులు ఉండనున్నాయట. ఇక నాన్ వెజ్ ప్రియుల కోసం చికెన్ పెసరట్టు, ఎగ్ దోశ, చికెన్ దోశ , మటన్ పెసరట్టు, మటన్ కీమా, ఎగ్ భర్పి, అరిసెలు, బోటి వడ నాటుకోడి పులుసు, ఉప్మా ఇడ్లీ, చికెన్ పొంగల్‌, పెసర పునుగులు, మద్రాసు ఫిల్టర్ కాఫీ, ఫ్రెష్లీ స్కీజ్డ్‌ ఆరంజ్ జ్యూస్, కోకోనట్ వాటర్ ఉన్నాయట.
 లంచ్ లో గోంగూర అన్నం, బెండకాయ పులుసు,  వంకాయ పచ్చడి, మామిడికాయ పప్పు, వెజిటేబుల్ బిర్యానీ, టమాట పప్పు, ఉలవచారు, గుత్తొంకాయ కూర, ఆంధ్ర ఆవకాయ, దొండకాయ ఫ్రై, ఆలు కుర్మా సాంబారు రైస్, కర్డ్‌ రైస్, పూతరేకులు, బూందీ లడ్డు కూడా పెట్టనున్నారట. ఇక మాంసాహార ప్రియుల కోసం మటన్ పులావు, చికెన్‌ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, నాటుకోడి వేపుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకి అంతం లేనట్లే ఉంది. ఏదైనా ఒకవేళ గెలిస్తే జగన్ తన వైపు నుంచి మంచి విందు భోజనాన్ని ప్రజలకు ఇంకా నేతలకు కార్యకర్తలు అందరికీ వడ్డించబోతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: