ఏపీ: ప్లాన్ వర్క్ అవుట్ అయితే.. ఫ్యాన్ గిరా.. గిరా..!

Divya
గత ఎన్నికలలో గెలిచిన స్థానాలను ఈసారి కూడా కైవసం చేసుకునేందుకు వైసిపి పార్టీ ఎన్నో మార్పులు చేర్పులు  కూడా చేసింది. గత ఎన్నికలలో కంటే ఈసారి తాము చాలా స్థానాలలో క్లీన్ స్వీప్ చేస్తామంటూ గ్యారెంటీగా ఉందంటూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి అలాగే 7 ఎస్టి నియోజకవర్గాలు కూడా ఉన్నవి. గత ఎన్నికలలో కేవలం 2 సీట్లు మాత్రమే ఇందులో ఓటమిపాలయ్యింది. అయితే ఈసారి వాటిని కూడా వదిలేది లేదనే విధంగా పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

గత ఎన్నికలలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి కొండంపీ  నుంచి టిడిపి పార్టీ విజయం సాధించగా రాజోలు నుంచి జనసేన పార్టీ విజయాన్ని అందుకుంది. ఇది మిగిలిన 27 స్థానాలలో వైసిపి పార్టీని సీట్లను గెలుచుకుంది. ఏడు ఎస్టి స్థానాలను కూడా కైవసం చేసుకుంది. అయితే ఈసారి కూడా ఏడు స్థానాలు తమవే అన్న ధీమాతో ఉంటున్నాయి. అందుకు కారణం తమకు బలమైన నాయకత్వం ఉండడంతో పాటు విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు ఈ నమ్మకం ఏర్పడిందని తెలుపుతున్నారు..

రిజర్వుడు నియోజకవర్గం ఈసారి వైసీపీ అధినేత జగన్ అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను కూడా మార్చడం జరిగింది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు స్థానిక వైసీపీ నేతలతో అసంతృప్తులు ఎక్కువగా వినిపించాయి. అందుకే కేవలం కొన్ని నియోజకవర్గాలలో మాత్రమే మార్చారు. అయితే జగన్ ప్లాన్ వర్కౌట్ అయినట్లుగా ప్రస్తుతం కనిపిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి అభ్యర్థులు పాతవారికె ఎక్కువగా టికెట్లు కేటాయించారు. ముఖ్యంగా పార్టీ నేతలు మధ్య గొడవలు అభ్యర్థి అభ్యర్థులు మార్పుతో తమకు కలిసి వస్తాయని అంచనా తెలియజేస్తున్నారు వైసీపీ నేతలు. గతంలో మాదిరి ఈసారి కూడా అన్ని సీట్లను తామే కైవసం చేసుకుంటామని విశ్వాసంతో వైసిపి నేతలు ఉన్నారు అలాగే సంక్షేమ పథకాలు కూడా తమ కలిసి వచ్చేలా ఉన్నాయని కూడా తెలియజేశారు. ఇలా అన్ని కలిసి వస్తే ఖచ్చితంగా ఫ్యాన్ తిరుగుతుందా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: