టీవీ: బిగ్ బాస్ ద్వారా భారీగా సంపాదిస్తున్న యూట్యూబ్ రివ్యూవర్..!

Divya
ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఎలాంటి చిన్న విషయమైనా సరే చాలామంది తెలుసుకోవడానికి ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ వంటివి ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా బిగ్ బాస్ రియాలిటీ షో బేసిక్ ఫార్ములా కూడా ఇదే బుల్లితెర వెండితెర మీద కనిపించిన చాలామంది సెలబ్రిటీలను నాలుగు గోడల మధ్య కెమెరాలలో బంధించి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా టాస్కులు నామినేషన్ వంటి అభిప్రాయాలు కాన్సిస్టెంట్ మధ్య గొడవలకు కూడా దారి తీసేలా ఉంటాయి. మొదట బ్రిటన్ లో ప్రసారమైన బిగ్ బ్రదర్ షోని బిగ్ బాస్ షో కి మూల కారణం అయ్యింది.

బిగ్ బ్రదర్ షోలో ఇండియా నుంచి శిల్పా శెట్టి పాల్గొని విన్నర్ గా నిలిచింది.. ఆ తర్వాత బిగ్ బాస్ గా హిందీలో ప్రసారం చేయగా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాతే అన్ని ప్రాంతీయ భాషలకు కూడా వ్యాపించింది. 2017లో మొదటిసారి బిగ్ బాస్ షోని ఎన్టీఆర్ మొదలుపెట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు వరుసగా ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ రివ్యూ వర్స్ ఒక్కొక్కరుగా పుట్టుకొచ్చారు. ముఖ్యంగా కంటెస్టెంట్ ప్రవర్తన హోస్ట్ జడ్జిమెంట్ ఏం జరుగుతుంది ,ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయాన్ని ముందుగా అంచనా వేస్తారు

తెలుగులో కొంతమంది బిగ్ బాస్ రివ్యూస్ ఉన్నారు. వీరు కొన్ని లక్షల రూపాయలను సంపాదిస్తున్నారట. ఆదిరెడ్డి మిత్రుల సలహా మేరకు బిగ్ బాస్ రివ్యూ ఇస్తూ ఉంటారు. ఆరు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రతి నెల 39 లక్షల సంపాదన ఉన్నట్టుగా చూపించారు ఆది రెడ్డి. మరొక బిగ్ బాస్ రివ్యూవర్ గీతు రాయల్ కూడా బిగ్బాస్ రివ్యూస్ వల్ల ఫేమస్ అయ్యింది. సీజన్ సిక్స్ లో పాల్గొన్న ఈమెతో పాటు బిగ్ బాస్ రివ్యూవర్ మహీధర్ సంపాదన కూడా లక్షల లోనే ఉందట. ఇలా బిగ్బాస్ రివ్యూ తెలియజేస్తూ నెలకు లక్షలు, వేలు సంపాదిస్తున్నారు వీరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: