జగన్: ప్రమాణ స్వీకారానికి.. టైమ్ కూడా ఫిక్స్.. ఏందయ్యా మీ కాన్ఫిడెన్స్..!

Divya
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జూన్ 4వ తేదీన వెలువడబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఉదయం 11 గంటల తర్వాత నుంచే ఫలితాల పైన ఒక్కొక్కటిగా క్లారిటీ వస్తూ ఉంటుంది. 2019లో వేవ్ ఉండకపోయినా విషయం పై మాత్రం కాస్త స్పష్టత వచ్చిందని చెప్పవచ్చు. మరొకపక్క గెలుపు పై కూడా కూటమితో పోలిస్తే వైసిపి నేతలు మాత్రం చాలా ధీమాతోనే వ్యవహరిస్తున్నారు. టిడిపి నేతలు మాత్రం రాబోయేది కూటమినే అంటూ తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జగన్ రెండవసారి ప్రమాణస్వీకారాన్ని జూన్ 9న విశాఖలో చేస్తారని వైసీపీ నేతలు చాలా బలంగానే నమ్ముతున్నారు.
జగన్ లండన్ పర్యటనలకు వెళ్లే ముందు కూడా ఐ ప్యాక్ టీమ్ ను కలిసి ఎన్నికల ఫలితాల పైన మాట్లాడడం జరిగింది. ఈసారి కూడా చాలామంది ఊహించని రీతిలో విజయాన్ని అందుకుంటామంటూ తెలియజేశారు. ఆ సమయంలోనే అప్పటి వరకు డేటు ప్లేస్ ను ఫిక్స్ చేసిన వైసీపీ నేతలు ఈ క్రమంలోనే తాజాగా టైమును కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జూన్ 9వ తేదీన విశాఖలో ఉదయం 9:30 నిమిషాల నుండి 11:30 గంటల మధ్య సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి వైసీపీ నేతలు ప్లాన్ చేశారట..
పోలింగ్ రోజున మహిళలు వృద్ధులు బూత్ ల వద్ద కట్టిన క్యూలు.. వర్షం పడుతున్న ఆగని ఓటింగ్ పరిస్థితిని చూసి జగన్ ని గెలిపించడానికి ఇది సంకేతం అన్నట్లుగా వైసిపి నేతలు చాలా ధీమాతోనే ఉంటున్నారు.. మరొకపక్క కూటమిలో మాత్రం గెలుపు దిమాని ఈ స్థాయిలో కనిపించడం లేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే వైసిపి నేతలు ఇంత ధీమాతో తమ నేత రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తారనే విధంగా తెలియజేస్తున్నారు. మరి వైసీపీ నేతలు అనుకున్నట్టుగానే ప్రమాణ స్వీకారం చేస్తారా లేకపోతే కూటమి సైలెన్స్ విక్టరీ సాధిస్తుంద లేదా అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: