ఫైనల్ సర్వే: వైసిపి 1st కోల్పోయే సీట్ అదేనట..!

Pandrala Sravanthi
 రాజకీయాల్లో బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనేది  మనం వింటూనే ఉంటాం. ఎంతటి ఉద్దండులైనా సరే ప్రజలకు వీసుగొస్తే ఓడిపోవాల్సిందే. అలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలిగా ఎదిగినటువంటి ఈమె ఈసారి ఓడిపోక తప్పదు అని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. మరి ఈమెను  ఓడించేది ఏ ప్రత్యర్థిలో శత్రువులో కాదు. సొంత పార్టీ నేతలే ఆమెపై విసుకు చెంది  ఓటమికి కారకులవుతున్నారు.  ఇంతకీ దురదృష్ట అదృష్టవంతురాలు ఎవరయ్యా అంటే నగరి ఎమ్మెల్యే మంత్రి రోజా. ఈమె నగరి నుంచి ఇప్పటికే రెండుసార్లు ప్రాతినిధ్యం వహించి ఘనవిజయం సాధించింది. 

రెండోసారి గెలిచినప్పుడు ఆమె టాలెంట్ ను గుర్తించి  జగన్ మంత్రి పదవి ఇచ్చారు. ఆమె మంత్రి పదవిని  సరైన మార్గంలో ఉపయోగించుకోలేదనే అపోహ సొంత పార్టీ నేతల నుంచే ఏర్పడింది. ఆమె మంత్రి పదవిని అడ్డుగా పెట్టుకుని తన సొంత బ్రదర్స్ మరియు భర్త  విపరీతంగా అక్రమాలు చేశారని సొంత పార్టీ నేతలను బెదిరింపులకు గురి చేశారనే ఆరోపణలు వచ్చాయి. చివరికి వైసిపి నాయకులే జగన్ దగ్గరికి వెళ్లి ఆమెకు టికెట్ ఇవ్వద్దని కారాకండిగా చెప్పారట. కానీ జగన్ పట్టించుకోకుండా ఆమెకి టికెట్ కేటాయించారట. 
అయితే రోజా ఓడిపోతుందనే నిజం ఆమె కి కూడా తెలుసు.ఇప్పటికే ఆమె నగరిలో చాలా సర్వేలు చేయించుకుని అన్ని తనకు నెగిటివ్ గా రావడంతో ప్రస్తుతం సైలెంట్ అయిపోయిందని తెలుస్తోంది.
అయితే చాలామంది సొంత నేతలపైనే రోజా అసహనం వ్యక్తి చేసిన సంగతి మనకు తెలిసిందే. పార్టీలో ఉన్న చాలామంది తన ఓటమి కోసమే చూస్తున్నారని ఇప్పటికే కొన్ని మీడియా సమావేశాల్లో చెప్పుకొని బాధపడింది రోజా. 
దీంతో వైసిపి నాయకులే ఆమెకు ఓటు వేయొద్దని ప్రచారం చేసినట్టు తెలుస్తోంది. దీంతో నగరిలో రోజా ఓటమి తప్పదని అంటున్నారు. అంతే కాదు వైసిపి పార్టీలో ఫస్ట్ ఓడిపోయే వ్యక్తి కూడా రోజానే అని  వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి రోజాకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది జూన్ 4వ తేదీన తేటతెల్లమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: