రోజా చంద్రబాబును ఏ సినిమా హీరోతో పోల్చిందో తెలుసా...!

Chakravarthi Kalyan
వైసీపీ ఎమ్మెల్యే రోజా.. చంద్రబాబుపై ఒంటికాలిపై లేవడంలో ఈమెను మించిన నాయకురాలు వైసీపీలోనే లేరు. ఇప్పుడు ఆమె వెరైటీగా మరో హాట్ కామెంట్ చేశారు. చంద్రబాబును ఏకంగా సినిమా నటుడితో పోల్చేసింది. రోజా పోల్చిందంటే అదేదో విలన్ కారెక్టర్ అయ్యే ఉంటుందని ఊహిస్తున్నారా.. అదేం కాదు. ఆమె పోల్చింది హీరోతోనే.



ఇంతకీ రోజా చంద్రబాబును పోల్చింది ఏ హీరోతో అనుకుంటున్నారు. తమిళ యాక్టర్ సూర్యతో. అవును.. ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గజిని గుర్తుంది కదా.. ఆ సినిమాలోని గజిని పాత్రతో చంద్రబాబును పోల్చింది రోజా. అవును.. ఆ సినిమాలో హీరో అన్నీ మరచిపోతుంటాడు కదా. అలాగే చంద్రబాబు కూడా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మరచిపోతున్నాడట. 


అంతే కాదు.. ఆ సినిమాలో హీరో తాను గుర్తుంచుకోవాల్సినవన్నీ పచ్చబొట్టు రూపంలో తన ఒంటిపై పొడిపించుకుంటాడు. ఇప్పుడు జనం కూడా చంద్రబాబుకు అదే తరహాలో పచ్చబొట్టు పొడిపించాలట. అప్పుడైనా చంద్రబాబుకు తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గుర్తువస్తాయంటోంది రోజా. నారా చంద్రబాబు అంకెల గారడి మరోసారి మహిళా వ్యతిరేకతకు అద్దం పట్టిందని రోజా విమర్శిస్తోంది. 


80 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ. 14,200 కోట్లు రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతిని రోజా గుర్తు చేస్తోంది. ఆ హామీని అమలు చేసేందుకు తగిన నిధులు కేటాయించకుండా ప్రభుత్వం అరకొర నిధులతో డ్వాక్రా మహిళలను నిట్టనిలువునా ముంచుతోందని రోజా విమర్శిస్తోంది. చంద్రబాబు తీరు వల్లే మహిళలు అప్పులు పాలవుతున్నారని.. కొత్త అప్పుల కోసం కాల్ మనీ బారిన పడుతున్నారని రోజా మండిపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: