చంద్రబాబు మేనిఫెస్టో ఇవాళే.. ఎన్ని హామీలిస్తారో?

Chakravarthi Kalyan
మొన్న జగన్‌ మేనిఫెస్టో విడుదల చేశారు. తాజాగా ఇవాళ చంద్రబాబు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేయనున్నారు. ఓటింగ్ మరో పది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు ఏం హామీలిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ మేనిఫెస్టో భారీ హామీలు ఏమీ ఇవ్వకుండా సింపుల్ గా విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చేసింది. వాటిని ప్రజల్లోకి బాగా ప్రచారం చేసింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో అంతకు మించి హామీలు ఉంటాయని చెబుతున్నారు.

టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కావడంతో ఎక్కువ అంచనాలు ఉన్నాయి. సూపర్ సిక్స్ పథకాలకు అదనంగా ఆకర్షణీయమైన హామీలు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. 2023 రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు గతంలో ప్రకటించారు.  ఆ తరువాత కూటమిగా ఏర్పడ్డారు. మూడు పార్టీలకు తమ సొంత హామీలు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కలిపి ఈ మేనిఫెస్టో రూపొందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: