అపర చాణక్యుడు..దాడుల్లో దిట్ట..అజిత్ దోవల్..!

Edari Rama Krishna
ఇప్పటి వరకు మనం సినిమాల్లో ఎన్నో గూఢాచారి సినిమాలు చూశాం. ఇక గూఢాచార్యం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది జేమ్స్ బాండ్ సినిమాలు. కేవలం ఒక నవల ఆధారంగా అప్పట్లో హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ సినిమా వచ్చింది..అది సెన్సేషనల్ హిట్ కావడంతో ఆ సీరీస్ పై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక మన తెలుగు ఇండస్ట్రీలో జెమ్స్ బాండ్ తరహా సినిమాలకు వన్నె తెచ్చిన వారు సూపర్ స్టార్ కృష్ణ. సీక్రెట్ మిషన్ తన భుజాన వేసుకొని శత్రువుల మద్యే తిరుగుతూ వారికి సంబంధించిన అమూల్యమైన సమాచారాని తమ దేశానికి చేరవేసే వారు గూఢాచారి.

అయితే ఇలాంటివి సినిమాల్లో చూస్తుంటే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది కానీ..మన దేశంలో నిజంగా శత్రుదేశమైన పాకిస్థాన్ లో గూఢాచార్యం చేసి శత్రువుల ప్రతి కదలికలను భారత్ కి చేరవేసిన గొప్ప హీరో ఒకరు ఉన్నారు. ఆయన ఎంతమందికి తెలుసు..? అవునండీ అజిత్ దోవల్.. ఈపేరు వినబడితే శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి..శత్రు దేశంలో అడుగు పెట్టి ఎవ్వరూ గుర్తు పట్టని విధంగా రక రకాల వేశాలు వేశాలు వేస్తూ శత్రు సమాచారాన్ని మన దేశానికి అందించారు..అంతే కాదు స్వర్ణ దేవాలయంలోకి ఉగ్రవాదులు చొరబఢ్ఢప్పుడు ఒక రిక్షావాడి వేషంలో అక్కడికి వెళ్లి పరిస్థితిని మన జవాన్లకు చేరవేశాడు, ఇవి కొన్ని మాత్రమే ఇంకా దేశం కోసం ఎన్నో ఆపరేషన్ లను నిర్వహించాడు, ధైర్యానికి మారుపేరు అజిత్ దోవల్.

మౌనంగా తనపనిని తాను చేసుకొని వెళ్లే దోవల్‌ వ్యూహాల్లో దిట్ట. పాక్‌ను ఏకాకి చేసేందుకు ఆయన అంతర్జాతీయంగా అన్నియత్నాలు ప్రారంభించారు. గతంలో పాక్‌లోని భారత దౌత్యకార్యాలయంలో సిబ్బందిగా ఏడు సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు.  ఆయకు ఏ పని అప్పజెప్పినా ఆ మిషన్ పూర్తి అయ్యే వరకు నిద్రపోని మహా యోధుడు. అందుకే ఆయనపై నమ్మకంతో జాతీయ భద్రతా సలహాదారుగా మన నరేంద్ర మోడీ తీసుకున్నారు.  అంతే కాదు ప్రస్తుతం దేశ భద్రతను దెబ్బకొట్టాలని చూస్తున్న పాక్ ఉగ్రవాదలు ఏరివేతకు అజిద్ దోవల్ మరోసారి రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది.

pok లో మనకు అనుకూలంగా ఉన్న కొంత మంది ప్రజల సహాయంతో ఉగ్ర కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్పగించిన పనిని వారం రోజుల్లోనే పక్కాప్రణాలికలు రచించి భారత్ దెబ్బ ఎలా వుంటుందో పాకిస్తానుకు రుచి చూపించాడు.  అగ్ర రాజ్యాలకు సైతం ఇంత వేగంగా తమకు ఇచ్చిన టాస్క్ పూర్తి చేయరు..అలాంది ఉగ్రవాదులు దాడి జరినిక వారం రోజుల్లోనే  విజయవంతంగా పూర్తి చేశారు.


1971-99 మధ్య భారత్‌లో జరిగిన 15 విమాన హైజాకింగ్‌ యత్నాలను ఆయన ఆధ్వర్యంలోని భద్రతాదళాలు అడ్డుకొని కుట్రదారుల యత్నాలను భగ్నం చేశాయి. ఇటీవల అమెరికా భద్రతా సలహాదారు కూడా అజిత్ దోవల్‌కు ఫోన్ చేసి తమ మద్దతును తెలియజేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: