బాబు - పవన్ కళ్యాణ్ మద్య రాజకీయ బంధం ఎలాంటిది?


పవన్ కళ్యాణ్ పై ప్రజల నమ్మకం క్రమంగా సడలిపోతుంది. ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటం లేదు. బిజెపి-టిడిపి మైత్రీ బందానికి పవన్ కళ్యాణ్ మరో ముడి వేశాడు. అందుకే ఈ రాష్ట్రంలో తెలుగు దేశం అధికారములోకి వచ్చింది. కాని (2.06%) ఓట్స్ మాత్రమే ఆధిఖ్యతతో (102) సీట్స్ గెలుచుకున్న టిడిపి అధికారంలోకి వచ్చింది.  వైసిపి  (67)  సీట్స్ గెలుచుకొని ప్రతిపక్షమైంది. తెలంగాణాలో ఓటుకు నోట్ ద్వారా ఎం.ఎల్.ఏ ని కొనటానికి ప్రయత్నించి కేసులో చిక్కుకొని శ్లేష్మంలోని ఈగ లాగా ఇప్పటికీ గిలగిల కొట్టుకుంటున్న చంద్రబాబు ఇదే కుట్ర తో ఆంధ్రప్రదెశ్ లో మాత్రం విజయం సాధించి తనబలాన్ని పెంచుకున్నారు.


ఒక పార్టీ టికెట్ పై గెలిచి ప్రలోభాలకు లోబడి టిడిపి లోకి చేరిన వైసిపి ఎం.ఎల్.ఏ లు - చేర్చుకున్న ఆపార్టీ అధినేత చంద్రబాబు - ఈ తతంగానికి చట్టపరంగా వ్యవహరించకుండా కంతల్లోకి దూరి ధర్మాన్ని సమాధి చేయటానికి సహకరించిన స్పీకర్ కూడా న్యాయబద్దంగా నేరస్తులే.  ఇంత చండాలపు పార్టీకి సహాయం చేయటానికి ప్రయత్నించే పవన్ కళ్యాణ్ లోని  నిజాయతీ ఎంత ?  మనమొక సారి ఆలోచించాలి.


ప్రతిపక్షం శాసనసభలో ప్రశ్నిస్తే ఆ ప్రతిపక్ష సభ్యురాల్ని ఒక సంవత్సరం పాటు సభా బహిష్కరణ విధించారు. ఆమె ఒక మహిళ అని కూడా కనికరం చూపలేదు. తమ లోని కౌరవులను నిద్రలేపారు. సభని కౌరవసభని తలపించారు. అధికార టిడిపి సంబందీకులే నూతన రాజధాని లో కాల్మని రాక్షసులైనారు. వనితలపై కాల్మని రాక్షసులు జరిపిన లైంగిక హింస స్థాయి మరచిపోలేనిది. కల్తీ మాఫియా, భూకబ్జా మాఫియా, ఇసుక మాఫియా, స్త్రీలపై దాడులు అత్యాచారాలు ఆపై హత్యలు, కళాశాలలలో ఆత్మహత్యలు, దేవాలయాలను, దేవతా విగ్రహాలలను అత్యంత కిరాతకంగా దౌర్జన్యం చేసి తొలగించిన విదానం హిందూ హృదయాలను కలచివేశాయి.

వీటన్నిటి వెనుకా టిడిపి అనుయాయులు, ఆశ్రితులు, మంత్రులు, ఎం.ఎల్.ఏ లు, అధికార కేంద్రానికి అతిదగ్గరు వారున్నట్లు బహిరంగంగానే తెలుస్తుంది టెలివిజన్ సాక్షిగా జనం చూశారు. విస్తుపోయారు. పదిహేనేళ్ళ పాలనానుభవం ఉన్న నాయకుని పాలనంటే ఇదా! హత విధీ! అనుకున్నారు.


భూసేకరణలో అంతర్గత రహస్య సమాచారాన్ని లీక్ చేసి భూములను స్వంతం చేసుకున్నారు. మోడీ "మేక్ ఇన్ ఇండియా" అని నెత్తి నోరు బాదుకుంటున్నా అమరావతి నగర నిర్మాణం సింగపూర్ కే ఒప్పగించే ఒప్పందం కుదుర్చుకున్నారు. స్విస్-చాల్లెంజ్ లో కూడా ఒక స్కాముందేమో? అనే భయం క్రమంగా రూపు సంతరించుకుంటుంది. కోర్టులే సంశయాలను వెలిబుచ్చుతున్నాయి. ఓటు కు నోట్ కేసు సినిమాని దేశమంతట ప్రజలు వీక్షించారు.


సాంకేతిక కారణాలతో బాబు తప్పించుకున్నా ప్రజలు ఇక బాబును ఆజన్మాంతమూ మరచిపోలేరు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రలోభాలతో కూల్చే బాబు అంటే ఆయన సామాజిక వర్గం, ఆయననుండి ప్రయోజనాలు పొందిన వారుతప్ప వేరెవరూ హర్షించని పరిస్థితి. మళ్ళీ ఓట్కు నోట్ కేసు ఫైల్ ఏసిబి కోర్ట్ తగిన ఆధారాలున్నట్లు నమ్మటం తో మరోసారి ఇన్వెస్టిగేషన్ చేయమని ఏసిబిని అదేసించటంతో కథ అడ్డంతిరిగి బాబు లోని నిప్పు చల్లారిందని ప్రజలు నమ్ముతున్నారు.


అభియోగాలు ఎదుర్కొనే నాయకుడెవరూ నైతికంగా పదవికి రాజీనామా చేయటం ధర్మం. అలాంటివి మాకేమి లేవు పాటించటం మా వంశాచారం కాదు అన్నట్లుంది ఆయన వ్యవహార శైలి. తను చేసిన నేరాన్ని తెలంగాణా గవర్నమెంట్ ఇంత దూరం తీసుకెళుతుంటే ఏపి ఇంటెలిజెన్స్ అధికారులపై విరుచుకు పడటం జనాన్ని విస్మయానికి గురిచేస్తుంది.


ఇన్ని లీలామానుష విగ్రహాన్ని సమర్ధించే పవన్ కళ్యాణ్ ని అభిమానులైనా ప్రశ్నించాలి? దుర్యొధనుని దరిచేరిన కర్ణుని బ్రతుకేమైందో? ఆయనకు వివరించాలి. వైసిపి నాయకుడు అసలే అవినీతి కంపులో కూరుకు పోవటం తో ఆ నీడనే తనకు రక్షా కవచంగా మార్చుకొని బ్రతుకు వెళ్ళదీసే బాబును పవన్ కళ్యాణ్ ఎంతకాలం తన భుజస్కందాలపై విక్రమార్కుడు శవములోని భేటాళున్ని మోసినట్లు మోస్తాడని ఆయన శ్రేయోభిలాషులు ఆందోళన పడుతున్నారు.


కాపులకు కులప్రాతిపదికన ముస్లిములకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కలిపిస్తానని ఓట్స్ వేయించుకున్నారు, ఆ వాగ్ధానాన్ని చట్టం ఒప్పుకోదని తెలుసు తనకు, అయినా ప్రజలకు వాగ్ధానం చేసేసినట్లే - మన్మొహన్ సింగ్ కూడా రాజ్యసభలో రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి అమలు చేయలేని కాని వాగ్ధానమిచ్చారని బాబు సరిపెట్టుకుంటే మంచిదికదా! పవన్ కళ్యాణ్ ఈ తప్పుల కుప్పతో స్నెహం చేయటం మంచిది కాదని ఆయన అభిమానులు కూడా ఆశిస్తున్నారు.


కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది రాజమౌళి ఎలాగూ 2017 లో బాహుబలి-2 లో చెప్పుతారు అనుమానం లేదు. మరి ఈ టీడిపి శవంలోని బేతాళున్ని ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు మోస్తున్నాడో? ఆ అవసరమేమిటో? ప్రజలకు విశద పర్చకపోతే రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో పవన్ కుప్పకూలటం ఖాయం. అభిమానులు ఆయనపై ప్రేమ అభిమానాలుంటే నివారించాలి ఆయన్ని ఈ తెలుగు దేశం శవజాగరణ మానివేయాలని కోరితే మంచిదని ప్రజలు పవన్ శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: