వికలాంగునిపై ఎస్వీయూ ప్రతాపం:నవసమాజమా నవ్వుకో..?

venugopal Ramagiri
ఆడ వాళ్ల పురిటి నొప్పులు ఆడవాళ్లకే తెలుస్తాయి.కనీసం మన సమాజంలో ఈ మాట ఐనా అన్నారు.ఎందుకంటే వినడానికి బాగుంటుందని.కాని భరతమాత పురిటి నొప్పులు ఎవ్వరు తెలుసుకుంటారు.పుడమికి పురిటి నొప్పులా అని ఆశ్చర్య పోకండి. మనిషిలోని అవయవాలు అన్ని బాగుండి,అవి సక్రమంగా పనిచేస్తే ఆరోగ్యవంతుడంటారు.ఏదో లోపం అవయవాల్లో కనిపిస్తే అతడు వికలాంగుడంటారు.అలాగే పుడమి పై పుట్టిన ప్రతివాడు అందరు తనవారేనని భావించి నడుచుకుంటే, అవినీతికి, అన్యాయాలకు, కుతంత్రాలకు తావుండదు.



ఇప్పుడు మనషుల మనసుల్లో ఇలాంటి పవిత్ర భావాలు పతనమై రోజు రోజుకు అపవిత్రమవుతున్నారు.అందుకే సత్యశీలుల భారాన్ని మోసిన పుడమి,నేడు అపవిత్రుల పాద ధూళిలతో అనారోగ్యపాలవుతూ,భరించలేని పాపాలను తన గర్భంలో దాచుకుని భరించలేక వేదన పడుతుంటే,వినేవారు ఎవ్వరు,కనే వారు ఎవ్వరు.ఓ నవ సమాజమా నవ్వుకో మనసార నవ్వుకో.నీ విద్యార్ధులు నడి వీధి పాలవుతుంటే నవ్వుకో,అసహాయులను,దివ్యాంగులను అవమానాలపాలు చేస్తుంటే నవ్వుకో...



చూసావా భరతఖండము,ఎంత గొప్పదో.ఎటువైపు చూడు అవినీతి అందాలాలు ఎక్కుతుంది.అన్యాయం సెంటుకొట్టుకుని ఆడుతుంది.దౌర్జన్యం దొరక్కుండా దౌడు తీస్తుంది.పాఠశాలల పరువులు పోతుంటే,యూనివర్సిటీలు యూజ్లెస్స్‌గా మారుతున్నాయి.విద్యనేర్పవలసిన వారు వీధి రౌడిలు అయిపోతుంటే,చదువుల తల్లి సరస్వతి కుమిలి కుమిలి కన్నీరు పెడుతుంది.అంబేద్కర్ రచించిన రాజ్యాంగ అందమైన షోకేసుల్లో మూలుగుతుంది,గాంధీజీ నేర్పిన అహింస వాదం గుండెల్ని బాధపెడుతుంది.నీ నవసమాజ నిర్మాణంలో వికలాంగులపై దాడులు ,విద్యార్ధుల ఆత్మహత్యలు,



నిర్లక్ష్యపు దోరణితో విద్యావంతులు.ఎస్వీయూ లోని అన్యాయాలు.ఇవేనా ఇవేనా రాబోయేతరాలకు మనం నేర్పే పాఠాలు. ఆచార్యదేవోభవ అంటే అర్ధం  ఎస్వీయూ ఇంచార్జ్ రిజిస్టార్ గారి ఆఫీసులో జరిగిన సంఘటన చూసి నేర్చుకోవాలేమో... అందుకే ఓ నవ సమాజమా నవ్వుకో మనసార నవ్వుకో..ధరణి దరహసం చిదిమేసి నవ్వుకో విద్యార్ధుల భవితతో ఆడుకుంటూ నవ్వుకో....అని వేదనతో,రాలే కన్నీటిని తుడుచుకుంటూ,కాలం చాటున రగిలే నిప్పు రవ్వల కొలిమిలా విద్యార్ధుల్లో ఆవేశం రగలకముందే మేలుకోరా అధికారులు అని ఎస్వీయూ క్యాంపస్ విద్యార్ధులు అవినీతిని ప్రశ్నిస్తూ వున్నారట....


65 సంవత్సరముల ఘన చరిత్ర కలిగి, యావత్ రాయలసీమ, చిత్తూరు మాత్రమే కాక... యావదాంధ్రకు మేధో భాండాగారమై, కలియుగ దైవము శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పేరు మీద నడపబడుతున్న శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం... జన ప్రియ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన రెడ్డి గారి జనప్రియ పారదర్శక పాలనోలనన్నా ప్రక్షాళన కావింపబడి తెలుగు జాతికే గర్వకారణంగా నిలువాలనేదే ... స్వప్రయోజన-స్వార్ధాలకు పాల్పడే వారు కాకుండా యూనివర్సిటీని అభివృద్ది పధాన నడిపే వారు నాయకులుగా ఉండి అందరి హక్కులనూ కాపాడాలనేదే   ఈ పోరాట అంతిమ లక్ష్యం.



వికలాంగునిపై ఎస్వీయూ అఘాయిత్యం గురించి మరిన్ని పరిశోధనాత్మక విశ్లేషణలు: 

  • వికలాంగునిపై ఎస్వీయూ ప్రతాపం: పది రోజులైపోయింది ?

  • ఆత్మహత్యలు బెదిరింపులు ఇవేనా సార్లు మీరు నేర్పే చదువులు..?

  • ఎస్వీయూ..? సాయం చేసే వారినే సాధిస్తారా..? ఇదేం మాయరోగం..?

  • ఎస్వీయూ రిజిస్ట్రారు సారూ..? ఆ ఉద్యోగాలు ఎంతకు అమ్మేసుకున్నారు..?

  • అభిన‌వ సూసైడ్ ఫ్యాక్ట‌రీలుగా త‌యార‌వుతోన్న విద్యాల‌యాల త‌ప్పులు..?

  • "వీళ్ళు మారరప్పా : సీఎస్సార్ వద్దు, కమిషన్లే ముద్దు ...ఇదీ ఎస్వీయూ పద్దు"

  • సంచలనం : మొన్న విద్యార్థి బలవన్మరణం, నేడు వికలాంగుడిపై దాడి ఆరోపణలు - కొత్త ఇంచార్జి రిజిస్ట్రార్ చేతగానితనమే కారణమా..?

  • మంచి మాకొద్దు - మనీనే ముద్దంటున్న ఘన యూనివర్శిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ ?

  • యూనివర్శిటీలు రాజకీయాలకు అడ్డాలుగా మారాయా..?

  • ఎస్వీయూ ప‌రువు రిజిస్ట్రార్ చేతిలో గోవిందా.. గోవిందా...?

  • అర్రే: రాష్ట్రం మొత్తం వైసీపీ ప్ర‌భుత్వం... ఇక్క‌డ మాత్రం టీడీపీ అజెండానే.. ?

  • ఎస్వీయూ ఘోరంలో రాజకీయ కోణం !

  • హృదయ విదారకం : ప్లీజ్ సర్ నేను వికలాంగున్ని నన్ను మరింత భయపెట్టొద్దు ప్లీజ్ ?

  • చట్టం ఏమైనా వారికి చుట్టమా ... కేసు ఎందుకు నమోదు చేయలేదు ?

  • చట్టాలు చేసేవాళ్ళను తయారుచేసే వాళ్ళే పంచాయతీలు చేస్తే ఎలా ?

  • ఎస్వీయూ బాగుపడాలంటే డైరెక్టుగా ముఖ్యమంత్రి జగన్ గారే రంగంలో దిగాలా ?

  • పేరుకు ఆచార్యులు.. వీళ్లకు సాంప్రదాయాలు పట్టవా ?

  • ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?

  • విశ్వ విద్యాలయాలు - నిజంగా ఆధునిక దేవాలయాలేనా :ఎస్వీయూ సోదాహరణ?

  • హతవిధీ : ఎస్వీయూ ఫెయిల్ మళ్ళీ మళ్ళీ...?

  • హవ్వా 'ఎస్వీయూ' నీకిది తగునా ?

  • ఆచార్యులేనా వీళ్లు - వికలాంగునిపై బ్రహ్మాస్త్రమా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: