తెలుగుదేశం ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయటం అత్యవసరమేనా!

అనంతపురం లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసి పలితాల కోసం ఎదురుచూసే సభ్యుడు దాదాపు అర్ధ దశాబ్ధం రాజకీయాల్లో మునిగి తేలుతున్న జేసీ దివాకర రెడ్డి తనకు తానే ఓపెన్ గా, నిర్భయంగా, బోల్డ్ గా ఓటుకు ₹ 2000/- (అక్షరాలా రెండు  వేల రూపాయలు మాత్రమే) చొప్పున పంచినట్టుగా రమారమీ తనకు ఎన్నికల పరంగా యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు గా జేసీ ప్రజా సమక్షంలో చెప్పేశారు. అన్నీ టెలివిజన్ చానళ్ల సాక్షిగా ప్రజలంతా వీక్షించారు. ఇదీ స్వయంగా జేసీ దివాకర రెడ్డి చెప్పిన మాట. ఇపుడు రాష్ట్ర ఎన్నికల సంఘం మేల్కొంటే మంచిదని ఎన్నికల్లో పోటీ చెసే సభ్యుడు పెట్టే ఖర్చుపై నియంత్రణ ఉంది. మరి ఇప్పుడు బాల్ ఎన్నికల సంఘం కోర్టులో ఉంది. నిర్ణయం ఎన్నికల సంఘానిదే. 


ఇంకా చాలా విషయాలే చెప్పారాయన. కొంతమంది ఓటుకు ఐదు వేల రూపాయలు అడిగారని అయితే అంత ఇవ్వలేక రెండు వేల రూపాయలతో సరి పెట్టినట్టుగా జేసీ వివరించారు. రాజకీయాలు ఇలా ఖరీదుగా మారాయని అవినీతి సొమ్మునే అలా పంచినట్టుగా కూడా జేసీ దివాకర రెడ్డి చెప్పారు. తాము మాత్రమే కాదని అని, రాష్ట్రమంతా అన్నీ పార్టీల నుండి పోటీ చేసిన ప్రతి అభ్యర్ధి అదే స్థాయిలో ఖర్చు పెట్టినట్టుగా జేసీ దివాకర రెడ్డి చెప్పారు.


మాట్లాడటంలో జేసీ దివాకరరెడ్డికి ధీటైన వారు లేరు. అంతే కాదు ఆయన బహిరంగంగా ఏ విషయమైనా కుండ బ్రద్దలు కొట్టి నట్లు మాట్లాడగలరు. అలా మాట్లాడటం ఒక్కోసారి ఆయనకు, ఆయన నాయకునికి, ఆయన పార్టీకి ఇబ్బందికరంగా తయారౌతుంది. ఒకవేళ జేసీ దివాకరరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను ఈసీ సీరియస్ గా  తీసుకుంటే అది పెద్ద వివాదం అవుతుంది. ఆ స్థాయిలో మాట్లాడారు దివాకర రెడ్డి. ఒక వేళ ఎన్నికల సంఘం సమర్ధవంతంగా పని చేస్తుందని ఋజువు చేసుకోవాలి అంటే ఇదే సరైన అవకాశం. మన ఎన్నికల వ్యవస్థకే జవం జీవం అందించి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన టి ఎన్ శేషన్ లాంటి అధికారి ఉంటే అది వేరేగా ఉండేది.


అనంతపురం లోక్ సభ స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జేసీ దివాకరరెడ్డి ఈసారి తన వారసుడుగా తన తనయుడిని అక్కడ పోటీ చేయించిన సంగతి తెలిసిందే. ఇటీవలే పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, ఈ ఎన్నికల అనుభవాన్ని జేసీ దివాకర రెడ్డి వివరించారు. ఆయన చెప్పిన  దాన్ని ప్రకారం, ఏకంగా యాభై కోట్ల రూపాయలు ఖర్చు తన తనయుడి విజయం కోసం ఖర్చు పెట్టినట్టుగా జేసీ చెప్పుకొచ్చారు.


ఇక ఆయన తన తెలుగుదేశం పార్టీ ఒకవేళ విజయం సాధిస్తే "పసుపు–కుంకుమ డబ్బులు జనాలకు  అందాయి కాబట్టి సరిపోయింది లేకపోతే మరింత డబ్బులను పంచాల్సి వచ్చేది.." అనే మాట మన దౌర్భాగ్యపు ప్రజాస్వామ్యం తలపై సమ్మెట పోటు అనే భావించాలి. ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చిన "పసుపు- కుంకుమ సొమ్ములు" అలా పరోక్షంగా ఓట్ల కొనుగోలుకు దారిమళ్ళించినట్లుగా భావించాలి. ఆయన పచ్చిగా సూటిగా సుత్తిలేకుండా చెప్పిన మాటలను బట్టి చూస్తే, మన రాష్ట్రంలో ఎన్నికలు ఏ రీతిన జరిగాయో, ప్రజాస్వామ్యం ఎలా మంటగలిసి పోతుందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. స్వయంగా ఒక ప్రముఖ అనుభవఙ్జుడైన నేత ఈ విషయాలను చెప్పారు కాబట్టి ఏపీలో ఎన్నికలు జరిగిన తీరుకు ఇంతకన్నా వేరే ఉదాహరణలు అవసరం లేదేమో! నిజాయతీగా నిష్పక్షపాతంగా సూటిగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తే ఏపిలో జరిగిన ఎన్నికలు అభ్యర్ధుల ఖర్చు పై కమిటీ వేసి, నేరస్థులపై చర్యలు తీసుకోవటం ఎంతైనా అవసరం. 


"తెలుగుదేశం ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయటం నేడు  అత్యవసరం" అంటూ తగిన చర్యలు తీసుకొని ఉండేవారు ప్రధాన ఎలక్షన్ కమీషనర్ టిఎన్ శేషన్  అయుంటే. "ప్రజాధనాన్ని ఓటర్లను ప్రలోభ పెట్టటానికి దారి మళ్ళించిన సందర్భం" పై ఎన్నికల సంఘం ఎందుకు స్పందించదు?  దేశ ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా తక్షణం ఈ విషయంపై స్పందించి ప్రజాస్వామ్య విలువలను ఒక గాడిలో పెట్టతం చాలా అవసరం. ఈ విషయంపై క్షేత్రస్థాయి నివేదిక కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి తక్షణం సమర్పించటం రాష్ట్ర ఎన్నికల అధికారి బాధ్యత.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: