సీఎం కాదు..కాలేజీ పోరడే..ఒక్కో టీ షర్ట్ లక్ష ?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ప్రతిరోజు వార్తలు నిలుస్తున్నారు. ఆయన తీసుకుని నిర్ణయాలు వివాదంగా మారిపోతున్నాయి. హైడ్రా నుంచి మొదలుకొని మూసి రివర్ డెవలప్మెంట్ కార్యక్రమాల వరకు.. అన్ని చిక్కులే అని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పైన.. తెలంగాణ ప్రజలంతా తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారని ఈ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేషధారణ పైన కూడా విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా తెలంగాణ కేబినెట్ సమావేశంలో కూడా టీ షర్ట్లు ధరించడం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన గులాబీ పార్టీ దారుణంగా ట్రోలింగ్ చేస్తోంది. అసలు నువ్వు ముఖ్యమంత్రివా? లేక కాలేజీ పోరనివా? అంటూ ఓ రేంజ్ లో... గులాబీ పార్టీ సోషల్ మీడియా రెచ్చిపోతుంది. మామూలు టీషర్ట్లు కాకుండా రౌండ్ నెక్ టీ షర్ట్లు వేసుకొని.... కాంగ్రెస్ పార్టీ పెద్దలు, తెలంగాణ కేబినెట్ సమావేశం, మోడీతో మీటింగ్ లలో పాల్గొంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ విషయాన్ని కూడా దారుణంగా ట్రోలింగ్ చేస్తుంది గులాబీ సోషల్ మీడియా.
అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసుకునే బట్టలు అలాగే షూ, చెప్పులపైన కూడా సెటైర్లు పేల్చుతోంది. రేవంత్ రెడ్డి వేసుకునే ఒక్కో షర్టు లక్ష రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. ఆయన వాడే చెప్పులు 50 వేలకు పైగా ఉంటాయట. ప్రజా పాలన చేసే వ్యక్తి ఇలా లగ్జరీ... బట్టలు అలాగే చెప్పులు వేసుకుని... పరిపాలన చేస్తారా అంటూ నిలదీస్తోంది గులాబీ పార్టీ సోషల్ మీడియా.
ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాపాలన అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. అయితే గులాబీ పార్టీ సోషల్ మీడియా.. రెచ్చిపోతున్న నేపథ్యంలో తాజాగా అసెంబ్లీలో కూడా కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తనపై కామెంట్స్ చేసే వారి బట్టలూడదీసి కొడతానంటూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అయితే దీనికి కూడా గులాబీ సోషల్ మీడియా కౌంటర్ ఇవ్వడం గమనాభం.