పిఠాపురం: నాగబాబు వ్యాఖ్యలు కూటమికి చేటు తెచ్చేనా..?

frame పిఠాపురం: నాగబాబు వ్యాఖ్యలు కూటమికి చేటు తెచ్చేనా..?

Divya
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిన్నటి రోజున పిఠాపురంలో చాలా గ్రాండ్గా జరిగాయి. జనసేన పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సందర్భంగా జయకేతనం అనే పేరుతో సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు ( ఎమ్మెల్సీ) చేసినటువంటి కామెంట్స్ పెను దుమారాన్ని సృష్టించేలా ఉన్నాయి.. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి రెండే కారణాలు అంటూ తెలియజేశారు.

అందులో ఒకటి పవన్ కళ్యాణ్ అనే పేరు మరొకటి పిఠాపురం ప్రజలు అంటూ తెలియజేయడం జరిగింది. అంతేకానీ పవన్ కళ్యాణ్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకున్నట్లు అయితే అది వారి కర్మ అంటూ వెల్లడించారు.. దీంతో నాగబాబు చేసిన కామెంట్స్ ఒక్కసారిగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత వర్మను ఉద్దేశించే చేశారని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. వచ్చే రెండు మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు నాగబాబు. ఈ విషయాన్ని ఒక జన సైనికుడుగా చెప్పుకోవడం చాలా గర్వంగా ఉన్నదని తెలిపారు.

అలాగే పిఠాపురం ప్రజలు జనసైనికులకు ఎప్పటికీ రుణపడి ఉంటారని నాయకులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో చూపించామని వారి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశామని రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని పవన్ కళ్యాణ్ ఎవరూ చెబుతూ ఉండేవారని తెలిపారు నాగబాబు. ప్రజల బాగోగులు చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఇలాంటి గొప్ప వ్యక్తి అన్ని రాష్ట్రాలలో ఉండాలని నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతున్నది. మరి ఈ వ్యాఖ్యలకు కూటమి ఏ విధంగా స్పందిస్తుంది వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: