ఏపీ: ఆ జనసేన నేత మోసపోయారా..?
దివంగత నేత వైయస్సార్ చలువతో 1999లో ఒంగోలు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.. ఆ తర్వాత 2004,2009 లో కూడా వరుసగా గెలిచారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక ఈయన మంత్రిగా కూడా పని చేశారట. వైయస్సార్ మరణం తర్వాత బాలినేని వైసీపీ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు.. అలా 2012 ఉపాధి ఎన్నికలలో కూడా గెలిచిన ఈయన 2014లో ఓడిపోయారు మళ్ళీ 2019లో గెలవడం జరిగింది. మూడేళ్లపాటు జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు.
అయితే చివరి రెండు ఏళ్ల కాలంలో మంత్రి మండలి లో మార్పు చేయడంతో బాలినేని మంత్రి పదవి కూడా పోయింది. దీంతో అసంతృప్తి చెందిన ఈయన 2024 ఎన్నికల ముందే టీడీపీలోకి చేరాలనుకున్నారట.. కానీ చేరలేకపోయారు.. ప్రస్తుతం జనసేన పార్టీలోకి చేరారు.. అది కూడా తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయాలని ఒప్పందం మీదకి ఆయన వైసీపీ నుండి జనసేన పార్టీలోకి వెళ్లారని ప్రచారం కూడా కొనసాగింది. దీంతో ఎమ్మెల్సీ సీటును కూడా ఆయనే ఖాళీ చేయించారని మరొక ప్రచారం కూడా సాగింది. జయ మంగళంవెంకటరమణ అనే ఎమ్మెల్సీతో రాజీనామా కూడా ఈయన చేయించారని వార్తలు వినిపించాయి..
కానీ ఆ తర్వాత ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ చేసుకుంది.. బాలినేనికి దక్కాల్సిన మంచి ఇప్పుడు నాగబాబుకు వెళ్ళిపోయింది.. ఇలా జరగడం వెనక తెర వెనుక పెద్ద స్కెచ్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తనను ఆదరించిన వైయస్ కుటుంబాన్ని కాదనుకొని అత్యాశకు పోయి బాలినేని మినిస్టర్ పోస్ట్ దక్కుతుందని అనుకున్నప్పటికీ కానీ కూటమిలో టిడిపి జనసేన నుంచి సరైన ఆదరణ లభించలేదని వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికి ఇంకా ఆయన వైసీపీ నేతగానే చేస్తున్నట్లు సమాచారం.