బంధాలను బలోపేతం చేసే టెక్నిక్ ఇదిగో..!
భార్యాభర్తల బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో ఎమోషనల్ బాండింగ్ చాలా ముఖ్యం. ప్రవర్తనలో, మాటల్లో, చేతల్లో ప్రేమను వ్యక్త పరచడం, అప్పుడప్పుడు సర్ ప్రైజ్ లు ఇవ్వడం, పరస్పరం కేర్ చూపించడం, రొమాన్స్ లో ఇరువైపులా సరైన రెస్పాన్స్ వంటివి ఎమోషనల్ బాండింగ్ ను మరింత బలోపేతం చేస్తాయి. దీంతోపాటు కలిసి సినిమాలకు రెస్టారెంట్లకు వెళ్లడం, ఏకాంతంగా గడిపేందుకు, మనసులో విషయాలను షేర్ చేసుకునేందుకు సమయం కేటాయించడం బంధాన్ని బలోపేతం చేస్తాయి. బంధంలో అది ముఖ్యమైనది నమ్మకం. ఇది ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు ఎదురైనా వివాదాలు, వండి ప్రాబ్లమ్స్ తలెత్తవు. భాగస్వామిపై అన్ని సందర్భాల్లోనూ చూపించే ప్రేమ నమ్మకాన్ని పెంచుతుంది.
భార్యాభర్తలు తమ తమ పనుల్లో, బాధ్యతల్లో సహాకరించుకోవడం, నిర్వహణల విషయంలో ప్రశంసలు వంటివి మరింత మేలు చేస్తాయి. ఆయా సందర్భాల్లో కాంప్లిమెంట్స్ అనేవి అవతలి వ్యక్తిని స్పెషల్ పర్సన్ లా గుర్తిస్తారని భావిస్తారు. ఇద్దరిలోనూ ఇది కొనసాగితే పరస్పర గౌరవం, నమ్మకం పెరిగి బంధం మరింత బలంగా మారుతుంది. బంధంలో ఎగ్జాస్ట్మెంట్ ఉండేలా చూసుకోవటం ఒత్తిడిని దూరం చేస్తుంది. ముఖ్యంగా రొమాన్స్ విషయంలో ఎగ్జైట్ మెంట బంధాన్ని మరింత స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. రొమాంటిక్ మూమెంట్స్ ఆక్సిటోసిన్, డిపమైన వంటి హార్మోన్లు విడుదలను ప్రేరేపించడం వల్ల హ్యాపీనెస్ను పెంచుతాయి.