యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ‘దేవర’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా తర్వాత ఆయన బాలీవుడ్ లో ‘వార్ 2’ అనే సినిమా చేస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీతో పాటు పలు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో ఎన్టీఆర్ చేతులు కలపబోతున్నారు.అయితే ఇప్పుడు కూలి సినిమా తర్వాత లోకేష్ .. మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ తో ఓ భారీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.అలాగే ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా దేవర సక్సెస్ తర్వాత వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించనున్నాడు .
వీటితో పాటు దేవర2 కు సంబంధించిన పనులు కూడా ప్రారంభం కానున్నాయి . ఇదే క్రమంలో లోకేష్ కనకరాజ్ సినిమా ను ప్రశాంత్ నీల్ మూవీ తో పాటు ఉంటుందని తెలుస్తుంది . ఇక ఇప్పటికే దేవరతో ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో సింగల్ గా రూ. 500 కోట్లకు పైగా భారీ కలెక్షన్ అందుకుని టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మరో సవాల్ విసిరాడు.అలాగే ప్రభాస్ తర్వాత ఈ స్థాయిలో కలెక్షన్ అందుకున్న హీరోగా నిలిచాడు. అలాగే తన తర్వాత సినిమాలతో కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. అలాగే కోలీవుడ్లో లోకేష్ కనకరాజ్ కాకుండా మరో దర్శకుడు వెట్రిమారన్ తో సినిమా చేయాలని ఉందని కూడా ఎన్టీఆర్ ప్రకటించాడు. అయితే ఎవరు ఊహించిన విధంగా ఇప్పుడు లోకేష్ కనకరాజ్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇదిలావుండగా ఎన్టీఆర్, ప్రభాస్ లను కలిపి మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడు అంటూ మరికొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి వీటిలో ఏది నిజం అనేది తెలియాలంటే మాత్రం వీళ్లలో ఎవరో ఒకరు అఫీషియల్ గా అనౌన్స్ చేసేంతవరకు వెయిట్ చేయాల్సిందే...ఇక ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లను సెలెక్ట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అందులో ఎన్టీఆర్ కూడా ముందు వరుసలో ఉండడం విశేషం.ఇక మరి ఎన్టీఆర్ తో లోకేష్ ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తారో చూడాలి.