ఆ ఒక్క వివాదం వల్ల పరువు పోగొట్టుకున్న బాలయ్య.. ఎప్పటికీ ఇబ్బందేనా?

Reddy P Rajasekhar
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్యకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉండగా బాలయ్య సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే 2016 సంవత్సరం మార్చి నెలలో బాలయ్య చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. అమ్మాయికి ముద్దు అయినా పెట్టాలి... కడుపుపైనా చేయాలి కమిట్ కమిట్ అంటూ బాలయ్య కామెంట్లు చేశారు.
 
ఆ సమయంలో ఈ కామెంట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బాలయ్య సరదాగానే ఈ కామెంట్లు చేసినా అభిమానులు మాత్రం ఈ కామెంట్ల వల్ల హర్ట్ కావడం జరిగింది. ఈ వ్యవహారం విషయంలో ఫిర్యాదులు సైతం నమోదయ్యాయి. అయితే బాలయ్య బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ద్వారా ఈ వివాదం సద్దుమణిగింది. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఈ వివాదం వల్ల కొంతమేర ఇబ్బంది పడ్డారు.
 
తర్వాత రోజుల్లో మాత్రం బాలయ్య ఈ తరహా వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చారు. బాలయ్య ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమాలో నటిస్తుండగా షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. 2025 సంవత్సరం జనవరి నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.
 
బాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా కమర్షియల్ గా ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. సితార నిర్మాతలు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ మొదలుకానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: