చరిత్రలో నిలిచిపోయే పాత్రలో అల్లుఅర్జున్.. బన్నీపై త్రివిక్రమ్ భారీ ప్రయోగం..!!
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని సుమారుగా 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మొట్టమొదటి పాన్ ఇండియన్ చిత్రం. ఇది వరకు ఆయన కేవలం ఫ్యామిలీ మూవీస్, కమర్షియల్ మూవీస్ మాత్రమే చేసేవాడు. మొట్టమొదటి సారి తన కంఫర్ట్ జోన్ ని వదిలి, భారీ బడ్జెట్ పీరియడ్ మూవీ తియ్యబోతుండడంతో అందరిలో ఆత్రుత నెలకొంది. పైగా ఒక ఫ్లాప్ తర్వాత కళ్ళు చెదిరే కం బ్యాక్ ఇవ్వడం త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అలవాటు. అజ్ఞాతవాసి లాంటి ఘోరమైన డిజాస్టర్ తర్వాత ఆయన ‘అరవింద సమేత’ లాంటి చిత్రంతో మన ముందుకు ఎలా వచ్చాడో, ఇప్పుడు ‘గుంటూరు కారం’ వంటి ఫ్లాప్ తర్వాత అల్లు అర్జున్ తో అదే తరహా సెంటిమెంట్ కొనసాగుతుందని మేకర్స్ బలమైన నమ్మకంతో ఉన్నారు.
ఇప్పటి వరకు అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అలా వైకుంఠపురంలో’ వంటి సంచలనాత్మక చిత్రాలు వచ్చాయి. టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ కాంబినేషన్స్ లో వీళ్ళిద్దరిది ఒక్కటి. పైగా ‘పుష్ప 2’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రాబోతున్న సినిమా, వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం కోసం అభిమానులు ఒక రేంజ్ లో ఎదురు చూస్తారు. అందుకే ఎక్కడా తగ్గకుండా ఉండేట్టు ప్లాన్ చేసుకున్నాడట త్రివిక్రమ్. జనవరి మొదటి వారంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ షూటింగ్ ని చేస్తారట, అదే విధంగా మార్చి నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారని ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్. న్యూ ఇయర్ లోపు ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ వస్తుందట.