బాలయ్య హీరోయిన్‌కు 49 ఏళ్లు అంటే నమ్ముతారా... శిల్పం రా బాబు...!
తెలుగు ప్రేక్షకులకు 1996లో విక్టరీ వెంకటేష్ హీరోగా .. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సాహస వీరుడు సాగర కన్య సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ శిల్పా శెట్టి. పొడుగు కాళ్ళ సుందరి అయిన శిల్పా శెట్టి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తి అయింది. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఏళ్లు .. అయినా ఎప్పటికీ ఆమె అంటే ఇష్టపడేవారు ఎంతోమంది ఉన్నారు. ఆమె సినిమాలు చేసినా ... చేయకున్నా ఓ వర్గం ప్రేక్షకులు ఆమె పై వావ్ అంటూ అదే అభిమానం చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆమె వయసు అక్షరాల 49 సంవత్సరాలు. అసలు ఏమాత్రం ఒంపులు లేని ఆమె అందం .. ఏమాత్రం ముడతలు లేని ఆమె సౌందర్యాన్ని చూస్తే ఈ తరం కుర్ర కురుకి కూడా పిచ్చెక్కిపోతుంది. అంతటి అభిమానులను సొంతం చేసుకున్న శిల్పా శెట్టి వయసు కేవలం 49 సంవత్సరాలైనా అంటే ఆశ్చర్యపోక తప్పదు.మనం.
శిల్పా శెట్టి ఈ వయసులో పాతికేళ్ల పడుచు అమ్మాయిలకు పోటీ ఇచ్చేంత అందంగా కనిపిస్తూ ఉన్నారు. శిల్పా నటి మాత్రమే కాకుండా .. యోగా ట్రైనర్ గా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. శిల్పా శెట్టి మొహంలో మూడు పదుల సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ అందంగా శిల్ప కనిపిస్తారు. ఎవరికైనా వయసు పెరుగుతుంటే అందం తగ్గుతూ ఉంటుంది .. అదేంటో గాని శిల్పకు వయసు పెరుగుతుంటే చెక్కిన శిల్పంలా అందం పెరుగుతూ వస్తోంది. రెగ్యులర్గా శిల్పా శెట్టి తన అందమైన ఫోటోలు షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈసారి జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియోలు షేర్ చేసింది. ఈ అందమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపుతున్నాయి. నెటిజన్లు లైకులు .. కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.