' కంగువా ' తో నిండా మునిగిన నిర్మాత‌.. ఎన్ని కోట్ల‌కు బొక్క ప‌డిందంటే.. !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా కంగువా. ఈ సినిమా భారీ అంచ‌నాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన స్థాయిలో ఆడలేదు. నిర్మాత పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఈ క్రమంలోనే అతని ఆదుకునేందుకు హీరో సూర్య ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. తమిళ బాహుబలి అంటూ కంగువా సినిమా కు జ‌రిగిన‌ ప్రచారం అంతా కాదు .. దర్శకుడు శివ రెండు విభిన్న కాలాల నేపథ్యంలో కంగువా సినిమాను తెరకెక్కించారు. సినిమా టీజ‌ర్లు .. పోస్ట‌ర్లు రిలీజ్ కు ముందే బాగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ సైతం మెప్పించడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను రు . 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. రెండేళ్లు ఈ సినిమా కోసం సూర్య కష్టపడ్డారు. గంగువా మూవీ ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. సినిమా విషయంలో ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తితో లేరు. కనీసం ఓపెన్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ర‌న్‌ ముగిసింది. కేవలం రు . 100 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ మాత్రమే ఈ సినిమా రాబట్టింది. తమిళంలో కూడా కంగువా నిరాద‌రణకు గురైంది. ఈ సినిమాతో నిర్మాతలకు రు . 130 కోట్ల భారీ నష్టాలు మిగిలినట్టు సమాచారం. కంగువా సినిమా ని కె ఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. అలాగే యూవీ క్రియేషన్స్ నిర్మాణ‌ భాగస్వామిగా ఉంది. సూర్యతో కేఈ జ్ఞాన‌వేల్ రాజాకు చాలాకాలంగా అనుబంధం ఉంది. జ్ఞాన‌వేల్ రాజా ను కంగువా కోలుకోలేని దెబ్బ కొట్టింది. దీంతో సూర్య ముందుకు వచ్చాడు .. అతనికి భరోసా కల్పించడంతోపాటు అతడి బ్యానర్ లో ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా మరో సినిమా చేస్తానని సూర్య హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య - కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన 44వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: