ఇండియా అంతా పూనకాలు తెప్పిస్తోన్న పుష్ప 2.. అక్కడ మాత్రం ప్లాపే... !
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రష్మిక హీరోయిన్గా నటించిన పుష్ప పార్ట్ 1 సినిమా 2021 లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. భారీ అంచనాలతో ఈ నెల ఐదున థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రు. 900 కోట్లకు పైగా వసూలు రాబట్టి థియేటర్లలో మాస్ జాతర చూపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అన్ని భాషలలో కలిపి ఏకంగా రు . 600 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. తెలుగు - హిందీ భాషల్లోనే పుష్ప 2 సినిమాకు ఎక్కువగా కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అందరి దృష్టి ఈ సినిమా మలయాళ కలెక్షన్ల మీద ఉంది. అల్లు అర్జున్ కు మలయాళం ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో డిజాస్టర్ అయిన అల్లు అర్జున్ వరుడు సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయింది.
ఇక పుష్ప 2 సినిమా అక్కడ బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు .. కానీ ఊహించిన విధంగా ఈ సినిమాకు మలయాళంలో దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి ఐదు రోజులకు గాను పుష్ప 2 మళయాళ వెర్షన్ కేవలం రు . 12 కోట్లు వసూలు చేసింది. కేవలం కేరళలో మాత్రం ఎందుకు అంత దారుణంగా వెనుకబడింది అంటే ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్ నటించారు. ఈ సినిమాలో పుష్పరాజ్ ఆ పాత్రను దారుణంగా అవమానిస్తాడు .. ఇది తమ హీరోలను తక్కువ చేసి చూపించినట్టుగా మలయాళ ప్రేక్షకులు భావిస్తున్నారు. అక్కడ ఉన్నది అల్లు అర్జున్ అయినా సరే పక్కన పెట్టేస్తామని ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ద్వారా మలయాళ సినీ ప్రేక్షకులు కరాకండిగా చెప్పేశారు.