తాత వయస్సులో రెచ్చిపోతున్న నరేష్..ఆ ఆంటీతో తగ్గేదేలే ?

Veldandi Saikiran
విజయనిర్మల కుమారుడు నటుడు నరేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్ ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ముఖ్యంగా నరేష్ లేటు వయసులో తన ప్రేమ కారణంగా తరచు వార్తల్లో నిలుస్తున్నారు. నరేష్ నటి పవిత్ర లోకేష్ తో ప్రేమాయణం కారణంగా పాపులర్ అయ్యాడు. ఇప్పటికే రెండు వివాహాలు చేసుకుని వారితో విడాకులు తీసుకున్న నరేష్ పవిత్ర లోకేష్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు.

పవిత్ర లోకేష్ కు ఇదివరకే వివాహం జరిగి భర్తతో విడాకులు తీసుకుంది. దీంతో వీరిద్దరూ ఎఫైర్ కొనసాగిస్తున్నారు. కలిసే ఉంటున్నారు. ఈ విషయాన్ని వారు బహిరంగంగా తెలియజేశారు. అయితే తాజాగా నరేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ పవిత్ర లోకేష్ తో తన లైఫ్ ఎలా ఉందనే విషయం పైన షాకింగ్ కామెంట్లు చేశాడు. విడాకుల పర్సంటేజీల గురించి మాట్లాడారు. కాగా, నరేష్ పవిత్ర లోకేష్ సీక్రెట్ గా వివాహం చేసుకున్నప్పటికీ ఈ విషయాన్ని అనౌన్స్ చేయడం లేదు.

దానికి గల ప్రధాన కారణం నరేష్ మూడో భార్య రమ్య రఘుపతితో ఇంకా విడాకులు తీసుకోలేదు. అయినప్పటికీ నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరు కలిసి ఉంటున్నారు. లేటు వయసులో వీరిద్దరి హాట్ లవ్ రిలేషన్ కి సంబంధించిన వార్తలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా వీరిద్దరూ కలిసి గతంలో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశారు.

ఆ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి సినీ నటులను అందరినీ ఆహ్వానించారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి "మళ్లీ పెళ్లి" అనే సినిమాను కూడా తీశారు. మళ్లీ పెళ్లి సినిమాను వారి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిని చూపించారు. కాగా, ప్రస్తుతం నరేష్ వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు పవిత్ర లోకేష్ కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: