మహారాష్ట్ర ఎన్నికలు: సింగిల్ గా మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బిజెపి.. గెలుపు పక్కా..?

Pandrala Sravanthi
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగిన రాష్ట్రం మహారాష్ట్ర.  ఇక్కడ కాంగ్రెస్,బిజెపి మధ్య విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది.  మొత్తం 288 స్థానాలకు గాను ఎలక్షన్స్ జరగగా రిజల్ట్ అనూహ్యంగా బయటకు వస్తోంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 66.05% ఓటింగ్ నమోదైన సందర్భంగా. మొత్తం ఎన్డీఏ నుంచి 149 స్థానాల్లో బిజెపి అభ్యర్థులను నిలబెట్టింది. మిత్రపక్షమైనటువంటి శివసేన 81 స్థానాల్లో పోటీ చేయగా, అజిత్ పవర్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో పోటీ చేసింది. గరిష్టంగా 101 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీలో దింపగా, శివసేన ( ఉబత)95 మంది అభ్యర్థులను, ఎన్సిపి శరత్ పవార్ 86 మంది అభ్యర్థులను దింపింది. బహుజన సమాజ్ వాది పార్టీ నిలబెట్టింది.

ఏఐఎంఐఎంకి 17 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా, అన్ని పార్టీల మధ్య పోటీ నెలకొన్న సందర్భంలో  మూడు రౌండ్స్ పూర్తయ్యేసరికి బిజెపి అత్యధిక లీడింగ్ లో ఉంది. ఇదే తరుణంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి మొత్తం 210 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వచ్చినటువంటి బిజెపి, ఇంకో 10 రౌండ్ల  వరకు ఇలాగే కొనసాగితే  తప్పకుండా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి అన్ని రౌండ్ల వరకు ఇలాగే కొనసాగుతుందా..లేదంటే ఇంకా కొన్ని రౌండ్లు వచ్చేసరికి తీర్పు అనేది మారుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

ఏది ఏమైనా బిజెపి కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తున్నాయి. ఇదే తరుణంలో ఎన్నో ఆశలు పెట్టుకొని రంగంలోకి దిగినటువంటి కాంగ్రెస్ వ్యూహాలన్నీ బెడిసి కొట్టి పోయాయి. శరత్ పవార్ ఎన్ని వ్యూహాలు పన్నిన బిజెపి ముందు తేలిపోయాయి అని చెప్పవచ్చు. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా బిజెపి అనేది మరోసారి తన సత్తా చాటుతూ ముందుకు వెళుతుందని మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: