ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం..ఇండియాకు భారీ నష్టం తప్పదా.. ?

Veldandi Saikiran
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మూడో ప్రపంచ యుద్ధం తరహాలో రెండు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒక దేశం పై మరొక దేశం మెరుపు దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ ఒకవైపు మిస్సైల్స్ తో దాడి చేస్తుంటే... ఇజ్రాయిల్ మాత్రం ఎక్కడ భయపడకుండా... ఆ దాడులను ఎదుర్కొంటోంది. అంతేకాదు ఇరాన్ ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీచేస్తుంది.
 

ఇరాన్ పాలకులను ఎవరు కూడా కాపాడలేరని ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇక ఆటో ఇజ్రాయిల్ హెచ్చరికలతో ఇరాన్ కూడా అలర్టై ముందుకు వెళ్తోంది. ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చుతోంది. అయితే ఈ రెండు దేశాల... మధ్య యుద్ధం ఉన్న అనే పద్యంలో... ఇండియాకు కొత్త సమస్య వచ్చి పడింది. రెండు దేశాల్లో ఉన్న ప్రజలను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగారు.
 

రెండు దేశాల ప్రతినిధులతో మాట్లాడి భారతీయులను ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే మన ఇండియా పైన ఆర్థికంగా కూడా... చాలా భారంపడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా...  ఇరాన్, ఇండియా మధ్య మంచి ఒప్పందాలు ఉన్నాయి. యుద్ధం వల్ల రెండు దేశాల మధ్య జరిగే ఎగుమతి అలాగే దిగుమతులు దెబ్బ తినే ఛాన్స్ ఉంది.  బాస్మతి రైస్, టీ ఉత్పత్తులు, షుగర్,ఫార్మసీ ఉత్పత్తులు, పప్పులు అలాగే ఇతర మాంసం లాంటివి... మన ఇండియా నుంచి ఇరాన్ కు ఎగుమతిఅవుతాయి.


అలాగే ఇరాన్ నుంచి మన ఇండియాకు కూడా కొన్ని వస్తువులు దిగుమతి అవుతున్నాయి.వాటిలో ఆర్గానిక్ కెమికల్స్, పెట్రోలియం బిట్యుమెన్ , మిథనాల్ , ప్రొఫైల్  ఆపిల్ అలాగే ఆల్మండ్... ఇలాంటివి మన ఇండియాకు దిగుమతి అవుతాయి. అయితే ఇరాన్ అలాగే ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరిగితే ఇండియా - ఇరాన్ మధ్య సంబంధాలు తెగిపోతాయి దానివల్ల మన ఇండియాకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లో ఛాన్స్ ఉంది. దానివల్ల మన ఇండియా ఎగుమతి రేటు క్రమంగా తగ్గిపోతుంది. అంతర్జాతీయంగా మనకు తీవ్రమైన నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: