ఏపీ: జనసేన-టిడిపి మంత్రుల మధ్య వైర్యమా.. సీఎం సీరియస్..!
నాలుగు రోజుల క్రితం వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు సహాయం అందలేదని చంద్రబాబుకు సైతం ఫిర్యాదులు వచ్చాయట. దీంతో సీఎం చంద్రబాబు అసహనానికి గురయ్యారట..తన పక్కనే ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ తో ఈ విషయాన్ని చర్చించారట.. అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన కూడా కొన్ని సూచనలు తెలియజేశారట. ఈ వ్యవహారాలను మరొక మంత్రి నారాయణ చూస్తారని చెప్పారని.. అలా కొంతమేర కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని నాదెండ్ల మనోహర్ సీఎం చంద్రబాబుకు సమాధానం చెప్పారట.
ఇద్దరు కూడ కోఆర్డినేట్ చేసుకుని ముందుకు సాగాలి కదా అంటూ చంద్రబాబు నాదెండ్ల పైన సీరియస్ అయినట్లుగా సమాచారం. అయితే సీఎం చంద్రబాబు ఇలా మాట్లాడడం ఇతర మంత్రులతో మాట్లాడిన పెద్దగా పట్టించుకునేవారు కానీ.. అక్కడ ఉన్నది జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ కావడం అందులో కూడ.. నాదెండ్ల కూడ నారాయణ పేరు చెప్పడం వల్ల ఇద్దరి మధ్య ఏదో జరిగిందనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. మంత్రి నారాయణకు, నాదెండ్లకు గ్యాప్ వచ్చిందని.. ఎవరికి తెలియకుండా వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని ప్రచారం వినిపిస్తోంది. వీటిని వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. ముఖ్యంగా వరద సహాయం అందించడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని. చంద్రబాబు జనసేన మంత్రి నాదెండ్లను చులకనగా చూశారు అనే విధంగా ప్రచారం చేస్తున్నారు.. ఇలా కూటమి నేతలు కుమ్ములాడుకుంటూ వరద బాధితులను పట్టించుకోలేదని విధంగా వార్తలు వినిపించాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.