డీల్ కుదిరిందా.. షర్మిలకు జగన్ లోటస్ పాండ్ ఇల్లు ఇచ్చారా?
జగన్, షర్మిల బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ బాగా దెబ్బతిన్నది. వాళ్ల అమ్మ విజయమ్మ కూడా సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. ఇన్సైడ్ ప్రకారం షర్మిల హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ ప్యాలస్, ఫ్యామిలీ ప్రాపర్టీ తనకే ఇచ్చేయాలని డిమాండ్ చేశారట కానీ జగన్ ఆమెకు ఇవ్వడానికి నిరాకరించారట. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రచారంలో షర్మిల జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అతను తన డిమాండ్‌కు అంగీకరించనందున ఆమె ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా మారారు అని అంటున్నారు.
అయితే రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం, షర్మిలతో వైరాన్ని ముగించాలని జగన్ భావిస్తున్నారట. అందుకే ఆమెకు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ హౌస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ సీనియర్ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఇక చెల్లితో గొడవ పడటం లేదు. పొలిటికల్ కం బ్యాక్ ఇవ్వాలంటే షర్మిల అవసరమని ఆయనకు తెలుసు." అని చెప్పారు.
ఈ డీల్‌కు మధ్యవర్తిత్వం వహించేందుకు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత ఒకరు సహకరించారట. ఆయనే సమస్యను పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించారట. షర్మిలకు ఇల్లు ఇవ్వడం ద్వారా కుటుంబ కలహాన్ని ముగించవచ్చని పొలిటికల్ కం బ్యాక్ పై దృష్టి సారించవచ్చని జగన్ ఆశిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ షర్మిల పెర్ఫార్మెన్స్ పై తీవ్ర అసంతృప్తి కనబరుస్తోంది అందుకే ఆమెను పార్టీ నుంచి బయటికి పంపించాలని చూస్తోంది ఈ నేపథ్యంలో అన్నతో కలవడమే ఆమెకు మంచిది అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
జగన్, షర్మిల మధ్య కుదిరిన డీల్ ప్రకారం హైదరాబాద్ లోటస్ పాండ్ ఇంటి నుంచి జగన్ బయటికి వెళ్లిపోతారు. షర్మిల జగన్ పై రాజకీయంగా దాడి చేయడం మానేస్తారు. ఇది నిజమో కాదో తెలీదు కానీ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇదే మాట వినిపిస్తోంది. మరోవైపు జగన్ చర్యలు పుకార్లకు మరింత బలం చేకూరుస్తున్నాయి. బెంగుళూరులోని యలహంక ప్యాలెస్‌ని అతను తరచుగా సందర్శిస్తున్నారు. తనకు చాలా ఇష్టమైన లోటస్ పాండ్ హౌస్‌కు వెళ్లడం లేదు.