జగన్‌ పై బంగ్లాదేశ్‌ తరహా తిరుగుబాటు ?

frame జగన్‌ పై బంగ్లాదేశ్‌ తరహా తిరుగుబాటు ?

Veldandi Saikiran
జగన్‌ పై బంగ్లాదేశ్‌ తరహా తిరుగుబాటు చేశారని ఏపీ ప్రజలను ఉద్దేశించి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కెబినెట్ అజెండా ముగిశాక మంత్రులతో వివిధ అంశాలపై ప్రస్తావించిన సీఎం చంద్రబాబు....ఎలాంటి తప్పులు చేయొద్దంటూ మరోసారి స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ లో తిరుగుబాటును జగన్ పాలనతో పోల్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

ఏ తప్పులు చేయకున్నా.. ఫేక్ ప్రచారంతో ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆగ్రహించారు సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ లాంటి పార్టీ.. జగన్ లాంటి నేత ఉన్నంత వరకు మనం అలెర్టుగా ఉండాలి.. ప్రజలనూ చైతన్యవంతులను చేయాల్సిందేనని వెల్లడించారు. అణిచివేత ఎక్కువై.. నియంతృత్వంతో వ్యవహరిస్తే బంగ్లాదేశ్ తరహా తిరుగుబాట్లే వస్తాయని హెచ్చరించారు. ఏపీలో సైలెంటుగా.. బంగ్లాదేశ్ లో వయొలెంటుగా ప్రజలు తిరుగుబాటు చేశారన్నారు.

ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలో చేనేత కోసం అవకాశాలు ఏర్పాటు చేస్తామని... నెలకి  200 యూనిట్లు నెలకు ఇచ్చేలా ప్రధానమంత్రి సూర్యకిరణ్ స్కీం లాగా మేం సిద్ధం చేస్తామని ప్రకటించారు.పర్యావరణ దృష్ట్యా సహజ రంగులు వినియోగించే అవకాశాలు చూడాలని... నేను పరుగెత్తి పరుగెత్తించడం వల్లే హైదరాబాదు..ఈ స్థాయికి వచ్చిందన్నారు.  1.8లక్షల డాలర్లు అమెరికాలో మన సాఫ్టువేరు ప్రొఫెషనల్ ఆదాయమని.... చేనేత కార్మికులు...మీ సమర్ధతను పెంచుకోవాలన్నారు. రాజకీయం కోసం, పదవుల కోసం ఆలోచించకూడదని కోరారు.

నేను నాలుగోసారి సీఎం అయ్యాక నా ఆత్మబంధువుగా ఉన్న చేనేత కార్మికుడినే కలిసానని... గత ప్రభుత్వంలో సర్వే రాళ్ళకు 700 కోట్లు ఖర్చు పెట్టారని ఆగ్రహించారు.  గత సీఎం ఋషికొండ ప్యాలెస్ కి 500 కోట్లు ఖర్చు చేసి తగులబెట్టాడు..అమరావతిలో ముళ్ళకంపలు తొలగించాలంటే 36 కోట్లు‌ అన్నారు. విద్యుత్ శాఖలో గత ప్రభుత్వం వల్ల 10వేల‌ కోట్ల నష్ట వచ్చింది...వేరే దేశాలు, రాష్ట్రాల నుంచీ వచ్చి ఓట్లేసారంటే ఆ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: