రివేంజ్ పాలిటిక్స్ : కక్ష సాధింపు రాజకీయాలకు చరమగీతం పాడేది ఎప్పటికో..?

murali krishna

* మారుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ తీరు
* కక్ష సాధింపులే లక్ష్యంగా కార్యకర్తల పని తీరు
* ముఖ్య నాయకులు సైతం ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలకు వంత పాడటం విశేషం
* ఇదే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారమే అని హెచ్చరిస్తున్న రాజకీయ విశ్లేషకులు


ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల తీరు మారుతూ వస్తుంది. గతంలో ప్రజలకు మంచి చేయాలని వచ్చి ప్రత్యర్ధులని మట్టి కరిపించాలని చూస్తే వారికే ఎదురు దెబ్బ తగులుతూ వస్తుంది...ఇది గత కొంత కాలంగా జరుగుతూనే వుంది.ఉమ్మడి ఏపీలో అధికారంలో వున్న కాంగ్రెస్ తనకు తిరుగులేదని భావించి అధికార గర్వంతో నాడు జగన్ ని జైలులో పెట్టించింది.ఏకంగా పదహారు నెలల పాటు జగన్ జైలులో ఉండగా, ఆ తర్వాత ఆయనకి ప్రజలలో సానుభూతి పెరిగింది. దాంతో జగన్ ఏపీలో కాంగ్రెస్ట్ పార్టీ ఊసే లేకుండా చేశాడు.ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి లేకుండా పోయింది.ఈ రివెంజ్ పాలిటిక్స్‌లో కాంగ్రెస్ కే పెద్ద దెబ్బ పడింది. 2014 ఎన్నికలలో విజయం సాధించిన టీడీపీ వైసీపీ నేతలపై విరుచుకుపడింది. అసెంబ్లీ లో జగన్ బలం తగ్గించేందుకు ఏకంగా 23 మంది ఎమ్మెల్యే లను టీడీపీ ప్రభుత్వం లాక్కుంది. అంతే కాదు వైసీపీ ముఖ్యనేతలపై కేసులు పెట్టించడం వంటి పనులు చేసింది. టీడీపీ చర్యకు విసిగి పోయిన జగన్ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసారు. చంద్రబాబు టైం వచ్చింది కొట్టాడు  తీసుకున్నాం మా టైం వస్తుంది మేము తిరిగి కొడతాం అని సవాల్ విసిరారు.ఆ తరువాత జగన్ అనూహ్యంగా పాదయాత్ర చేపట్టి 2019 ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించారు.
అయితే జగన్ ప్రభుత్వం ప్రజా వేదిక కూల్చిన దగ్గరి నుంచి అసలైన రచ్చ మొదలైంది. టీడీపీ కార్యకర్తల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. టీడీపీ ని ఎంతలా వేదించాలో అంతలా వేధించి చూపించారు. కొంతమంది జగన్ తాకిడి తట్టుకోలేక వైసీపీ లో జాయిన్ అయిపోయారు. టీడీపీ ముఖ్య నేతలే వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. వైసీపీ వచ్చిన గత ఐదేళ్ళలో చేయాల్సిన రచ్చ చేసేసింది. వైసీపీ టార్చర్ తట్టుకోలేని టీడీపీ కార్యకర్తలు తమ సమయం కోసం కాచుకొని కూర్చున్నారు. వారు కోరుకున్నట్లు గానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
వైసీపీ పార్టీని ఈ ఐదేళ్లలో భూ స్థాపితం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ ఉన్నట్లు తెలుస్తుంది. వైసీపీ కార్యకర్తలను వేదించడమే టీడీపీ కార్యకర్తలు పనిగా పెట్టుకున్నారు. ఈ పదేళ్లలో ఎన్నో రాజకీయ హత్యలు జరిగాయి.. ఈ హత్యా రాజకీయాలకు అంతం పలికేది ఎప్పుడో అని రాజకీయ విశ్లేషకులు అంతర్మదన పడుతున్నారు. కక్ష సాధింపులు ఉన్నంత కాలం ఆ రాష్ట్రం బాగుపడదు. అభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: