టీవీ: ఎట్టకేలకు లవ్ బ్రేకప్ ఎఫైర్ పై బిగ్ బాస్ హిమజ క్లారిటీ..!
హిమజ ప్రేమ పెళ్లిపైన మాట్లాడుతూ పెళ్లి గురించి ప్రస్తుతం తాను పట్టించుకోవడంలేదని ఎక్కువగా కెరియర్ గురించి ఆలోచిస్తున్నానంటూ వెల్లడించింది.. అలాగే తన జీవితంలో లవ్ లెటర్స్ ప్రపోజల్స్ తనకు పెద్దగా రాలేదని వెల్లడించింది.. కానీ తన లైఫ్ లో లవ్ స్టోరీలు ఉన్నాయని తనను చాలా మంది లవ్ చేశారు నేను కూడా వారిని లవ్ చేశాను ప్రస్తుతం ఎవరి లైఫ్ వారిది దాన్ని బ్రేకప్ అని చెప్పి లవ్ వ్యాఖ్యలను కూడా తీసివేయలేను.. ఒకసారి ప్రేమిస్తే అది లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది అది సినిమాలో నటించే క్యారెక్టర్ లాంటిది కాదు అంటూ వెల్లడించింది హిమాజ.
మీ లైఫ్ లో మీ హార్ట్ లో ఎవరైనా ఉన్నారా అని యాంకర్ అడగగా.. నా హార్ట్ లో చాలామంది ఉన్నారు కొంతమంది మనసులు అలాగే ఉండిపోయారంటూ వెల్లడించింది.. తాను ఎనిమిదో తరగతిలోని ఒకరిని ప్రేమించానని అతడు ఇప్పటికీ తన మనసులో అలాగే ఉండిపోయారని ఎమోషనల్ గా మాట్లాడింది హిమజ. తన లవ్ స్టోరీ గురించి చెప్పుకుంటూ పోతే కొన్ని కాపురాలు కూడా కూలిపోతాయని చాలామంది టైటిల్ పెట్టి ప్రచారం చేస్తున్నారు అసలు అందులో నిజం లేదని తెలియజేసింది హిమజ. కేవలం వ్యూస్ కోసమే ఇలాంటివి ఉపయోగిస్తున్నారని తెలిపింది.