
ఆ సర్జరీ వల్ల చాలా బాధలు.. ఎవరూ అడగలేదు.. రాధిక షాకింగ్ పోస్ట్ వైరల్!
రెండు నెలలు చాలా బాధగా గడిచాయని రాధిక అన్నారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో నా మోకాలికి గాయమైందని ఆమె చెప్పుకొచ్చారు. వైద్యులు సర్జరీ చేయించుకోవాలని సూచించారని రాధిక పేర్కొన్నారు. నొప్పి తగ్గడం కోసం ఎనో టాబ్లెట్లు వాడానని థెరపీలు చేయించుకున్నానని తప్పనిసరి పరిస్థితులలో నేను సర్జరీ చేయించుకున్నానని రాధిక కామెంట్లు చేశారు.
సర్జరీకి ముందు నొప్పిని భరిస్తూనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేశానని రాధిక తెలిపారు. పని విషయంలో నా అంకిత భావాన్ని చూసి ఒక ఫ్రెండ్ ఆశ్చర్యపోయాడని ఆమె చెప్పుకొచ్చారు. ఇంత కష్టపడుతున్నావ్ కదా.. ఆ నిర్మాతలు నీకు కృతజ్ఞతలు చెప్పారా అని స్నేహితుడు అడిగారని రాధిక కామెంట్లు చేయడం గమనార్హం. నేను అలాంటివి ఎప్పుడూ ఆశించలేదని అతడికి చెప్పానని ఆమె పేర్కొన్నారు.
నా పనిపై మాత్రమే నేను దృష్టి పెడతానని సర్జరీ సమయంలో నా భర్త నుంచి నాకు సపోర్ట్ లభించిందని రాధిక వెల్లడించారు. ఆయన నన్ను చిన్నపిల్లలా చూసుకున్నారని రాధికా శరత్ కుమార్ పేర్కొన్నారు. రాధిక వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. రాధికా శరత్ కుమార్ వయస్సు ప్రస్తుతం 62 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. రాధికా శరత్ కుమార్ వయస్సు పెరుగుతున్నా ఇప్పటికీ ఫిట్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆమె మరిన్ని సినిమాలలో నటించి విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.