సుమ-రాజీవ్ విడాకుల వ్యవహారంపై.. రోషన్ షాకింగ్ కామెంట్స్..!
ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోషన్ తన తండ్రి(రాజీవ్), ఎన్టీఆర్ కి మధ్య ఉన్న స్నేహబంధం అలాగే తల్లితండ్రులు విడాకుల పైన రూమర్స్ పై స్పందించారు. రాజీవ్, ఎన్టీఆర్ స్నేహం స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం నుంచి మొదలైందని స్పష్టం చేశారు రోషన్. వారిద్దరు మధ్య దూరం పెరిగిందనే వార్తలను ఖండిస్తూ.. ఎన్టీఆర్ కథకు తగిన పాత్ర ఉంటేనే రాజీవ్ కనకాలను తీసుకుంటారని చెప్పారు. ఇది వారిద్దరి మధ్య వృత్తిపరమైన సంబంధమని తెలియజేశారు.
ఇక సుమ, రాజీవ్ కనకాల విడాకులు వ్యవహారం పై వినిపించిన రూమర్స్ పై రోషన్ మాట్లాడుతూ.. ఈ వార్తలు మా కుటుంబానికి చాలా బాధ కలిగించాయి, కానీ ఆ వదంతులను తాము ఎవరు పట్టించుకోలేదని, మొదట్లో తల్లి సుమ కూడా ఈ విషయంపై చాలా బాధపడిందని తెలిపారు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే ధనవంతుడైన సరే ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటుంది. ఇలాంటి రూమర్స్ వల్ల తమను కూడా చాలా బాధపెట్టాయని తెలిపారు. తమ కుటుంబంలో అటువంటి సమస్యలు లేవని,బయట జరిగే ప్రచారాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకూడదనే విషయాన్ని నిర్ణయించుకున్నామంటూ తెలిపారు.