ప‌య్యావుల బ‌డ్జెట్ క్లోజ్‌... ఈ విష‌యం ప‌ట్టించుకోవాలి మీరు..!

RAMAKRISHNA S.S.
ప‌య్యావుల కేశ‌వ్‌. సుదీర్ఘ కాలంగా టీడీపీలో ఉన్న నాయ‌కుడు. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా ఉర‌వ కొండ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఆయ‌న‌కు మంచి పేరుంది. ఎన్నేళ్లు రాజ‌కీయాల్లో ఉన్నామ‌న్న‌ది కాదు.. రాజ కీయాల్లోకి వ‌చ్చామంటే.. ఎంతో కొంత వెనుకేసుకోవాల్సిందే.. అని భావించే యువ నేత‌లు ఉన్న కాల‌మి ది. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌లుగా కొన్ని ఆరోప‌ణ‌లు ప్ర‌తిరోజూ వినిపిస్తున్నాయి. కానీ.. మూడు ద‌శాబ్దాలు గా రాజకీయాల్లో ఉన్నా.. ఏనాడూ ప‌య్యావుల కుటుంబంపై చిన్న మ‌ర‌క కూడాలేదు.


గ‌తంలో అమ‌రావ‌తిలో భూములు కొన్నార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. వాటిని కోర్టు కొట్టి వేసింది. ఫ‌లానా చోట రాజ‌ధాని వ‌స్తుంద‌ని ముంద‌స్తుగా తెలిసినంత మాత్రాన అక్క‌డ ఏమీ కొనుగోలు చేయ‌కూడ‌దా ? అని కూడా కోర్టు ప్ర‌శ్నించింది. ఇలా.. ప‌య్యావుల‌పై ఎలాంటి మ‌ర‌కలు లేవు. ప్ర‌స్తుతం కూట‌మి స‌ర్కారులో ఆయ‌న ఆర్థిక మంత్రిగా ఉన్నారు. నిత్యం ఎంతో బిజీ. ప్ర‌తి శాఖ‌తోనూ ఆర్థికంగా ముడిప‌డిన అన్ని విషయాలూ.. ప‌య్యావుల పేషీకే వ‌స్తాయి. అయినా స్థానికుల‌తో ఆయ‌న క‌లివిడిగానే ఉంటారు.


ఇదిలావుంటే.. ప‌య్యావుల కుటుంబంపై తాజాగా వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో మట్టి మాఫియా ప్ర‌బ‌లి పోయింద‌ని.. ప‌య్యావుల కుటుంబం పాత్ర ఉంద‌ని వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంపై గ‌త నాలుగు రోజులుగా ఉర‌వ‌కొండ‌లో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు కూడా చేస్తున్నారు. అయితే.. బ‌డ్జెట్ హ‌డావుడిలో ఉన్న ప‌య్యావుల ఈ వ్య‌వ‌హారంపై దృష్టి పెట్ట‌లేదు. ఇక ఇప్పుడు బ‌డ్జెట్ అయిపోయిన నేప‌థ్యంలో ఈ ఆరోప‌ణ‌ల‌పై దృష్టి పెట్టాల‌ని స్థానికులు కోరుతున్నారు.


ఏంటి విష‌యం.. !
ఉర‌వ‌కొండ‌లోని ప్రసిద్ధ పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ పరిసరాల్లో మట్టి దోపిడీ జ‌రుగు తోందని స్థానికంగా తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. పెన్నహోబిలం ఆలయానికి ఈవో ను సైతం నియమించక పోవ‌డానికి మ‌ట్టి మాఫియానే కార‌ణ‌మ‌ని... పెద్ద ఎత్తున మట్టి దోపిడీ జరుగుతున్నా మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ స్పందించ‌డం లేద‌ని అంటున్నారు. దీనికి కార‌ణం.. ఈ మాఫియా వెనుక ప‌య్యావుల అనుచ‌రులు, వారి కుటుంబ స‌భ్యులే ఉన్నార‌ని చెబుతున్నారు.  ఈ నేప‌థ్యంలో వాస్త‌వాలువెలికి తీసేందుకు ప‌య్యావుల స్పందించాల‌ని స్థానిక టీడీపీ నేత‌లు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: