అసెంబ్లీ లో అవమానాలు : అప్పట్లో రోశయ్య వాగ్దాటికీ చేతులెత్తేసిన చంద్రబాబు

murali krishna

* అప్పట్లో తన పదునైన మాటలతో చంద్రబాబుని వణికించిన రోశయ్య
* మామ వెన్నుపోటుపై చంద్రబాబుకు మాస్ కౌంటర్ ఇచ్చిన రోశయ్య..
* రోశయ్య దాటికి చంద్రబాబుకి మాటలు రాని పరిస్థితి..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రివేంజ్ రాజకీయాలు నడుస్తున్నాయి.. అధికారంలో వున్న పార్టీ ఏదొకరకంగా ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టడానికి విపరీత చర్యలు చేపడుతుంది.. రాను రాను ఇలాంటివి మరి కాస్త ఎక్కువగా మారుతున్నాయి. గతంలోని రాజకీయాలు వేరు ఇప్పటి రాజకీయాలు వేరు. గతంలో ఒక విషయం గురించి అసెంబ్లీ లో ప్రస్థావించేటప్పుడు పూర్తిగా చర్చ జరిగేది. అధికార, ప్రతి పక్షం ఇద్దరూ కూడా అసెంబ్లీ లో ఎంతో హుందాగా నడుచుకున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం కక్ష పూరిత రాజకీయాలు ఎక్కువ అయ్యాయి. రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఆ ఎన్నికలలో వైసీపీ 60 కు పైగా స్థానాలు సాధించి ప్రధాన ప్రతి పక్ష హోదా దక్కించుకుంది. అయితే అసెంబ్లీ లో తరచూ టీడీపీ నాయకులు జగన్ ను అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యాడని అవినీతి పరుడని టీడీపీ నాయకులు మాస్ ట్రోలింగ్ చేసారు. దీనితో సభ నుండి బయటకు వచ్చిన జగన్ అప్పటి నుండి నిత్యం ప్రజలకు అందుబాటులో వున్నారు.. పాదయాత్ర కూడా చేసి 2019 ఎన్నికలలో ఏకంగా 151 సీట్లు సాధించి సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయినా టీడీపీ ని వైసీపీ ఎమ్మెల్యే లు ఒక ఆట ఆడుకున్నారు.

అంతే కాదు ఒకానొక సమయంలో ఆ విమర్శల పరంపర పరిధి దాటి వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునే స్థాయికి చేరింది.అసెంబ్లీ లో తన భార్యను అవమానించారని చంద్రబాబు ఎంతగానో ఎమోషనల్ అయ్యారు. అలాగే చంద్రబాబును అరెస్ట్ చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.దీనితో అవకాశం కోసం ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లు ఈ సారి అధికారంలోకి కూటమి రావడంతో వైసీపీ పై ప్రతీకార చర్యకు పూనుకున్నారు.వైసీపీ నేతలపై, కార్యకర్తలపై దాడులు వంటివి చేస్తున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  లో రాజకీయాలు ఇలా ఉండేవి కావు. ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలో వుంది. టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా వుంది.. అప్పట్లో ఎందరో దిగ్గజ నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో ఎంతో హుందాగా నడుచుకునేవారు.
అప్పటి కాంగ్రెస్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నారు. కాంగ్రెస్ లో ఎందరో సీనియర్ నాయకులు వున్నారు. వారిలో ఒకరు కొనిజేటి రోశయ్య.. అసెంబ్లీ లో ఆయన స్పీచ్ ఎంతో గంభీరంగా ఉంటుంది. ఒకానొక సమయంలో టీడీపీ ఒక డ్రామాలు వేసుకునే ఆయన పెట్టిన పార్టీ ఇప్పుడు వున్న పార్టీ నేతలు కూడా డ్రామాలు ఆడుతున్నారు అని విమర్శించారు. పార్టీ వ్యవస్థాపకులను విమర్శించిన రోశయ్య పై టీడీపీ నేత చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. దానికి కౌంటర్ గా రోశయ్య అదిరిపోయే సమాధానం ఇచ్చారు. నేను ఇంత వరకు డ్రామాలలో కత్తి పట్టుకునే వేషం కూడా చేయలేదు. ఎన్టీఆర్ గారు డ్రామాలు వేసి గొప్ప సినీ నటులు అయ్యారని తాను చెప్పినట్లు తెలిపారు. చంద్రబాబుకి ఎన్టీఆర్ అంటే ఒకప్పుడు గౌరవం ఉండేది. కొంతకాలనికి పోయింది మరలా తిరిగి వచ్చిందని చంద్రబాబును ఓ రేంజ్ లో ఆడుకున్నారు.ఇలా హుందాగా సాగే అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రజా సమస్యలు తప్ప తిట్టుకోడానికే పెట్టుకున్నట్లు గా అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: