టీడీపీకి దగ్గర అవుతున్న విజయసాయిరెడ్డి? అందుకే జగన్ దూరం పెడుతున్నారా?

Chakravarthi Kalyan

విజయ సాయి రెడ్డి పార్టీ మారడానికి ప్రయత్నం చేశారా? వైసీపీని వీడేందుకు సిద్ధపడ్డారా? అందుకే జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదా? దాదాపు పక్కన పెట్టేయడానికి ఇదే కారణంహా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. విజయ సాయి రెడ్డి టీడీపీ చేరేందుకు ఆసక్తి చూపారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


దీనిపై విజయ సాయి రెడ్డి కూడా గట్టిగానే స్పందించారు. అయితే ఆయన టీడీపీ వైపు రావడం ఏంటి అనే చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ ఆయన వచ్చినా టీడీపీ తీసుకునే అవకాశం ఉందా? టీడీపీ నుంచి సానుకూలత సంకేతాలు వెళ్లడంతోనే ఆయన స్పందించి ఉంటారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే టీడీపీలోనే  ఉన్నత వ్యక్తుల ద్వారా ఈ ప్రక్రియ జరిగినట్లు సమాచారం. మరోసారి రాజ్య సభ పదవిని రెన్యూవల్ చేస్తే తాను పార్టీ మారేందుకు సిద్దం అని సంకేతాలు వచ్చినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి.


అయితే విజయ  సాయి రెడ్డిని చేర్చుకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భావించిన టీడీపీ నాయకత్వం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీలో చేరేందకు ఆయన యత్నించినట్లు చెబుతున్నారు. కానీ రాజ్యసభ వదులుకుంటేనే చేర్చుకుంటామని బీజేపీ షరతు పెట్టినట్లు సమాచారం. అయితే ఇదే జరిగితే రాజ్యసభ పదవి టీడీపీ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో విజయ సాయి రెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.


అయితే ఈ విషయం తెలియడంతోనే జగన్ విజయ సాయి రెడ్డిని పక్కకు పెట్టినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు విజయ సాయి రెడ్డిపై అసలు విషయం బయట పెట్టారు. కానీ ఇప్పటికే జగన్ కు ఆయన విషయంలో సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పక్కన పెట్టినట్లు ప్రచాచరం జరగుతోంది. అసలు విజయ సాయి రెడ్డి పార్టీ మారాలని అనుకున్నా తీసుకునే ఉద్దేశం ఏ పార్టీకి లేదు. వైసీపీ లో నెంబర్ 2 గా ఎదిగే క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థికి మించి శత్రువుగా మారిపోయారు. అందుకే ఆయన ఏ పార్టీలో చేరరని.. విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: