దేవరలో జాన్వీ పాత్ర తగ్గించడంపై ప్రియుడు సీరియస్‌ ?

Veldandi Saikiran
ఆరు ఏళ్ల తర్వాత సోలోగా జూనియర్‌ ఎన్టీఆర్‌ రంగంలోకి దిగారు. ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 27న అంటే నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా విడుదలైన ఉదయం నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

డైరెక్టర్ కొరటాల శివ సినిమా కథ, డైరెక్షన్, ఎన్టీఆర్ యాక్టింగ్ పై అభిమానులు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ద్విపాత్రాభినయంతో ఎన్టీఆర్ అదరగొట్టాడని అలాగే యాక్షన్, మ్యూజిక్, బిజిఎం సినిమాకు ప్రధాన అస్సెట్స్ గా నిలిచాయని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా సత్తా చాటుకుందని మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 68 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 170 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే తాజాగా జాన్వీ కపూర్ యాక్టింగ్ పై ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా రియాక్ట్ అవుతూ తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేసుకున్నాడు. దేవర సినిమా నుంచి జాన్వి కపూర్ ఫోటో షేర్ చేస్తూ నేను ఏమైనా కలలో ఉన్నానా అంటూ కామెంట్ చేశారు శికర్ పహారియా. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్స్ ను ఆకర్షిస్తోంది. శికర్ పహారియా మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు.

జాన్వీ కపూర్, శిఖర్ పహారియా ప్రేమలో ఉన్నట్లు ఎన్నో రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం, దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించడం చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. అలాగే శిఖర్ పేరుతో జాన్వి నెక్షన్ కూడా ధరించింది. అయితే.. జాన్వీ పాత్రను తగ్గిచడంపై ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా అసహనంగా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: