రామ్మూర్తి నాయుడు: సోనియానే కాదు చంద్రబాబును ఎదురించి నిలబడ్డ వీరుడు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంత తీవ్ర విషాదం నెలకొంది. నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు... నారా రామ్మూర్తి నాయుడు మరణించారు. టాలీవుడ్ సీనియర్ హీరో నారా రోహిత్ తండ్రిగారే ఈ నారా రామ్మూర్తి నాయుడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు... ఇటీవల ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో.. ఇవాళ ఉదయం మరణించారు.

దీంతో చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే...  నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు రాజకీయ నేపథ్యం గురించి... అందరూ చర్చించుకుంటున్నారు. 1952 లో జన్మించిన రామ్మూర్తి నాయుడుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో ఒకరు నారా రోహిత్. 1994 సంవత్సరంలోటిడిపి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు.చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. మంత్రిగా ఉన్న గల్లా అరుణ కుమారుని... దారుణంగా ఓడించారు రామ్మూర్తి నాయుడు.

ఒకానొక సమయంలో చంద్రగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే  నారా చంద్రబాబు కూడా భయపడ్డారట. కానీ రామ్మూర్తి నాయుడు మాత్రం... చంద్రగిరిలో కాంగ్రెస్ మంత్రిని ఓడించారు. ఇక 2002 సంవత్సరంలో... నారా చంద్రబాబు నాయుడుతో గొడవలు పెట్టుకున్నారట రామ్మూర్తి నాయుడు.  ఆ సమయంలో తనపై దమ్ముంటే పోటీ చేయాలని చంద్రబాబుకు సవాల్ కూడా విసిరారట రామ్మూర్తి నాయుడు. దీంతో చంద్రబాబు వర్సెస్ రామ్మూర్తి నాయుడు మధ్య విభేదాలు పెరిగాయని సమాచారం.

ఇక చంద్రబాబు పైన కోపంతో... 2003 సంవత్సరంలో ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు రామ్మూర్తి నాయుడు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా... ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే అదే సమయంలో 2004 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని... రామ్మూర్తి నాయుడుకు ఆదేశాలు వచ్చాయి. కానీ అప్పుడు పార్టీకి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా.. చంద్రగిరి లో పోటీ చేశారు. అప్పుడు టిడిపి అభ్యర్థి రామనాథం  తో సమానంగా 36, ఓట్లు సాధించగలిగారు రామ్మూర్తి నాయుడు.  కానీ గల్లా అరుణ కుమారి చేతిలో ఓడిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: