బుమ్రా వల్ల అరుదైన రికార్డ్ సృష్టించిన అశ్విన్.. అదెలాగంటే?

praveen
అదేమిటి? బుమ్రా వల్ల అశ్విన్ రికార్డు సృష్టించడం ఏమిటి? అని అనుకుంటున్నారా? విషయం తెలియాలంటే ఈ పూర్తి కథలోకి వెళ్లాల్సిందే. కాన్పూర్ లో బంగ్లాదేశ్ తో ఆడుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో చాలా ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా తొలి రోజు ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆ దృశ్యం అశ్విన్ ఖాతాలో ఒక రికార్డు నమోదు అయ్యేటట్టు చేసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ రసభరితంగా సాగలేక పోయినప్పటికీ, అశ్విన్ ఖాతాలో మాత్రం ఓ అరుదైన రికార్డు నమోదు కావడం విశేషమనే చెప్పుకోవాలి.
ఇక విషయంలోకి వెళితే, కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలుచుకొని ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. అలా 31 పరుగులతో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్మల్ శాంటో చాలా పగడ్బందీగా ఆడుతూ ఉండగా అశ్విన్ బౌలింగ్ చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో వికెట్ కీపర్ పంత్ సూచించిన కారణంగా అశ్విన్ బౌలింగ్ వేశాడు. కట్ చేస్తే, శాంటో ఎల్ బి డబ్ల్యు కింద అవుట్ అయ్యాడు. ఇక ఈ వికెట్ తీసిన కారణంగా, అశ్విన్ ఆసియాలోనే మురళీధరన్ తర్వాత ఎక్కువ వికెట్లు తీసిన వాడిగా రికార్డులకు ఎక్కాడు.
ఈ క్రమంలోనే, టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించేందుకు రవిచంద్రన్ అశ్విన్ కేవలం 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్న్ 18 ఏళ్ల రికార్డును రవిచంద్రన్ అశ్విన్ బద్దలు కొట్టనున్నాడు. ఇక వర్షం కారణంగా తొలిరోజు 35 ఓవర్స్ మాత్రమే నడిచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 35 ఓవర్లకి గాను కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలో మూడు వికెట్లను కోల్పోయింది. ఇక అశ్విన్ టీం ఇండియా తరుపున 101 టెస్ట్ మ్యాచెస్ ఆడి, 37 సార్లు ఐదేసి చొప్పున వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ మరో నాలుగు వికెట్లు పడగొట్టినట్టయితే, షేన్ వార్న్ 18 ఏళ్ల గొప్ప రికార్డును బ్రేక్ చేసినవాడు అవుతాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో 38 సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ అవతరించబోతాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: