షాక్: నిర్మాతలతో పడుకుంటేనే అవకాశం.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!

Divya
జస్టిస్ హేమ కమిటీ వల్ల చాలామంది సెలబ్రిటీలు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాలని తెలియజేయడంతో.. ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు, నిర్మాతలు, నటుల మీద పలు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి .సినీ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో వాళ్లను భయభ్రాంతులకు గురిచేస్తోంది.తమిళంలో పలుచిత్రాలలో నటించి బాగానే పాపులారిటీ అందుకున్న నటి శృతి హరిహరన్ గడిచిన నాలుగేళ్ల క్రితం తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని సైతం ఇటీవలే వెల్లడించింది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ పైన ఈమె వాళ్ళు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

మొదటిసారిగా 2012లో శృతి హరిహరాన్ నటించిన మలయాళ చిత్రం కంపెనీ సినిమాతో హీరోయిన్గా తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఆ తర్వాత నీల, సోలో వంటి చిత్రాలలో కూడా నటించింది. మొదటిసారిగా ఇమే అర్జున్ సర్జా తనను కౌగిలించుకునే విధానాన్ని వివాదంగా తీసుకువచ్చింది. దీనిపై పోలీస్ స్టేషన్ లో కూడా ఇమే ఫిర్యాదు చేయగా అర్జున్ పైన సరైన సాక్షాదారాలు లేకపోవడంతో కోర్టు కూడా ఈ కేసుని కొట్టివేసింది. అలాగే  5 మంది తమిళ నిర్మాతలు తనకోసం ఒక వలవేసారని చెప్పి అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది.

2018లో శృతి వెల్లడించిన విషయాలు తమిళ నిర్మాత తనను లైంగికంగా లొంగదీసుకోవడానికి ఒక కమిట్మెంట్ అడిగారని.. ఐదు మంది నిర్మాతలు ఉన్నాము కాబట్టి.. ఐదు మంది నిర్మాతలకు కమిట్మెంట్ అడిగారని అయితే ఈ విషయం పైన తాను అభ్యంతరం చెప్పడంతో తమిళ సినిమా నుంచి తనని తీసివేశారు అంటూ తెలియజేసింది శృతి హరిహరన్. అప్పట్లో హైదరాబాదులో జరిగిన ఒక ఈవెంట్లో ఈ విషయాలను తెలిపిందట. అయితే కాస్టింగ్ కౌచ్ ఎదురైనప్పుడు తన వయసు 18 సంవత్సరాలేనని ఈ విషయం విని తను చాలాసార్లు ఏడ్చానని తెలిపింది. అందుకే తమిళంలో తాను ఎక్కువ సినిమాలు నటించలేకపోయాను అంటూ శృతి తెలియజేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: