దత్తపుత్రిక కోసం ఆ కంటెస్టెంట్ బలి చేసిన బిగ్బాస్..?
ఈవారం కంటెస్టెంట్స్ సోనియా, పృథ్వీ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వీళ్లు తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లో ఉన్నారని టాక్ నడుస్తోంది. సోనియా పై నిఖిల్ ఫ్యాన్స్ చాలా గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ నిఖిల్ ఆటను నెగిటివ్గా ప్రభావితం చేస్తోంది. అందుకే ఆమెను ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లగొట్టేయాలని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సోనియాపై కోపంతో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్న వారికి ఏం నిఖిల్ ఫ్యాన్స్ బాగా ఓట్లు వేస్తున్నారు దాంతో వేరే వాళ్ళు సేవ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సోనియా మాత్రం బలైపోవచ్చు. కొన్ని మీడియా వర్గాలు నిర్వహిస్తున్న పోలింగ్ విషయంలో నిఖిల్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ స్పష్టంగా తెలుస్తోంది.
ఈ వారం నామినేషన్లలో నబీల్, సోనియా, మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, ప్రేరణ, నైనిక ఉన్నారు. చీఫ్ నిఖిల్ తన స్పెషల్ పవర్ తో నైనికను నామినేషన్స్ నుంచి రక్షించాడు. ఈ వారంలో సోనియా, పృథ్వీ, నిఖిల్ ఆట తీరుపై నబీల్ చాలా బాగా మాట్లాడాడు. అతడి మాటలు నచ్చి ప్రేక్షకులు బాగా ఓట్లు వేశారు. సోమవారం నామినేషన్స్ లో నబీల్, సోనియా టీమ్ మధ్య పెద్ద మాటలు యుద్ధమే జరిగింది. దీని తర్వాత నబీల్ మొత్తం ఓట్లలో 35 శాతం ఓట్లు సాధించి టాప్ లో నిలిచాడు. అతని తర్వాత మణికంఠ ఎక్కువ రేట్లు సాధించాడు. ప్రేరణ కూడా ఈ వీక్ సేఫ్ అయిపోయినట్లే తెలుస్తోంది.
ఆదిత్య ఓం, పృథ్వీ, సోనియాలపై ఎలిమినేషన్ కత్తులు వేలాడుతుండగా.. సోనియాను ఇంటికి పంపించాలని నిఖిల్ ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్నారు. పృథ్వీ, ఆదిత్య ఓం కంటే ఆమెకే చాలా తక్కువ ఓట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది కానీ బిగ్ బాస్ మాత్రం సోనియాని సేవ్ చేసి ఆదిత్య ఓంని ఇంటికి పంపించేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఉంటేనే మజా ఉంటుందని బిగ్ బాస్ భావిస్తున్నట్లు సమాచారం ఓటింగ్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను బకరాలను చేయడానికి అతను మరోసారి సిద్ధమైనట్లుగా సమాచారం.