కొడాలి నాని - వ‌ల్ల‌భ‌నేని వంశీ జ‌గ‌న్‌కు భ‌లే దెబ్బ కొట్టారే... వైసీపీలో ఊహించ‌ని ట్విస్ట్ ఇది..?

Suma Kallamadi
వైయస్ఆర్ సీపీ అధినేత జగన్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకవైపు సొంత పార్టీలో ముఖ్యమైన నేతలు అనబడే వారు వలసలు పోతుంటే, మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం విషయంలో వివాదం ఉండనే ఉంది. ఈ క్రమంలోనే జగన్ రెడ్డికి మరో భారీ షాక్ ఇచ్చారు సొంత పార్టీ బడా మంత్రులు. ఇటువంటి షాక్ తగులుతుందని బహుశా, జగన్ ఊహించి ఉండడు. దాంతో జగన్ కి కుడి భుజంలాగా ఉన్నవారు వలస పోతారేమో అన్న భయం పార్టీ నేతలకు పట్టుకుంది.
ఇక అసలు విషయంలోకి వెళితే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో అరాచకాలు జరిగాయని వేలెత్తి చూపుతూ, ముఖ్యంగా తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో వైసీపీని విలన్గా చూపిస్తూ వివాదానికి తెరలేపిన సంగతి తెలిసినదే. ఈ క్రమంలో టిడిపి కూటమి పార్టీ గత ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రక్షాళన కార్యక్రమాలు తిరుపతిలో చేపట్టిన సంగతి మీకు తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టడం జరిగింది.
ఇక టిడిపి కూటమి ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వాలని తలచిన వైసిపి, టిడిపికి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్లోని అన్ని దేవాలయాల్లో కూడా ప్రక్షాళన కార్యక్రమాలను చేయవలసిందిగా వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు అందరూ ఆయా ఏరియాలలో గల దేవాలయాలలో ప్రక్షాళన పూజా కార్యక్రమాలు జరుపుతున్నారు. కానీ మాజీ మంత్రి కొడాలి నాని ఉన్న గుడివాడలో, వల్లభనేని వంశీ ఏరియా అయినటువంటి గన్నవరంలో ఎటువంటి కార్యక్రమాలు సదరు మంత్రులు నిర్వహించడం లేదని విశ్వసినీ వర్గాల సమాచారం. దాంతో వైసిపి వర్గీయులు ఈ ఇద్దరు మంత్రుల విషయంలో కాస్త అసహనంగా ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు వీరు కూడా మిగతా వలసపోయిన మంత్రులు లాగే, జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం జగన్ దాకా చేరడంతో ఆయా మంత్రులతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. కానీ కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా జనసేన వైపు ముగ్గు చూపుతున్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ చెలరేగుతున్నాయి. ఈ విషయం మీదాకా వచ్చినట్లయితే, ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయగలరు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: