వైఎస్సార్ @ 75: జాతీయ పార్టీలో రీజ‌న‌ల్ హీరోగా రికార్డ్‌...!

RAMAKRISHNA S.S.
- రెండు ద‌శాబ్దాల క‌ష్టంతో కాంగ్రెస్‌లో హీరోగా ఎదిగిన నేత‌
- ఆరోగ్య శ్రీ, ఇందిర‌మ్మ ఇళ్లు, ఉచిత క‌రెంటుతో పేద‌ల గుండెల్లో మారాజు
- వైఎస్ పునాదుల‌తోనే సీఎం అయిన కుమారుడు జ‌గ‌న్‌
( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ )
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తనదైనటువంటి స్థాయిలో ఒక చరిత్రను సృష్టించినటువంటి నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి. జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారు. వాస్తవానికి తొలినాళ్ల‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అంతగా గుర్తింపు లభించలేదు. ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది. ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై పెద్ద ముద్ర ఉంది. దీనిని అనేకమంది కాంగ్రెస్ నాయకులు కూడా సమర్ధించారు.

ఫలితంగా జాతీయ స్థాయిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తింపు పొందలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను గుర్తించేందుకు రెండు దశాబ్దాలకు పైగా సమయం పట్టింది. ఎంపీగా గెలిచినా, ఎమ్మెల్యేగా గెలిచినా అనేక సందర్భాల్లో పార్టీకి అంకితభావంతో పనిచేసినా అంత తేలికగా గుర్తింపు లభించలేదు. కానీ, 2004కు ముందు ఆయన చేసినటువంటి పాదయాత్ర తన జీవితంలో అత్యంత కీలక మలుపుగా చెప్పాల్సిన టువంటి అవసరం ఉంది. జాతీయ పార్టీలో ప్రాంతీయ నేతగా వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి బలమైన ముద్ర వేయడానికి పాదయాత్ర కీలకంగా మారింది.

సుదీర్ఘ పాదయాత్రలో ఆయన ప్రజలను కలుసుకోవడం పార్టీని బలోపేతం చేయటం అప్పటివరకు విజన్ ఉన్నటువంటి నాయకుడిగా బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబును అదే బలంతో ఎదిరించి ప్రజాబలంతో ఆయన రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకురావడం జాతీయ స్థాయి పార్టీ అయిన‌ కాంగ్రెస్‌లో చరిత్రను సృష్టించింది. అయితే ఇదే సమయంలో జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీగా మారుస్తున్నారు అనేటటువంటి చర్చ కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి వైపు తిరిగింది. అయిన‌ప్పటికి  ప్రాంతీయ పార్టీగా కాకుండా జాతీయ పార్టీగానే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లారు.

తీసుకునేటటువంటి నిర్ణయాల్లో పారదర్శకత లోపించకుండా జాతీయ నాయకత్వానికి ఎక్కడా భంగం కలగకుండా ఆయన వేసినటువంటి ప్రతి అడుగు చాలా కీలకమైన చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు.. జాతీయస్థాయిలో నాయకులు తీసుకునేటటువంటి నిర్ణయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చాయి. అటువంటి పరిస్థితి నుంచి ఏపీలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు తదితర అనేకమైనటువంటి కార్యక్రమాలను ప్రాంతీయ స్థాయిలో అమలులోకి తీసుకువచ్చారు.

వీటికి జాతీయ స్థాయి నాయకత్వం కూడా ఎటువంటి సందేహం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఆయన వ్యవహరించారు. అంటే ఆయనలో ఉన్నటువంటి రాజకీయ వ్యవహారాలకు, ప్రతిభా పాటవాలకు మచ్చు తునకగా చెప్పాలి. జాతీయ పార్టీలో ప్రాంతీయ నేతగా  ఉవ్వెత్తున ఎగిసినటువంటి కెరటం రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఆయన వేసినటువంటి పునాదులు ఇప్ప‌టికీ బలంగానే ఉన్నాయి. తదనంతర కాలంలో ఈ పునాదుల్ని జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఒక ప్రత్యేక పార్టీని పెట్టుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: