ఏపీ: అభివృద్ధి కోసం పట్టుబడుతున్న లోకేష్..!

Divya
ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం పరిశ్రమ బిల్లు పైన నా స్కామ్ చాలా అసంతృప్తిని తెలియజేసింది. ముఖ్యంగా అక్కడ ప్రైవేటు వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు తీసుకురావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో నా స్కామ్  అసంతృప్తిగా ఉన్నట్లు గుర్తించిన నారా లోకేష్.. ఆంధ్రాలో ఐటి విస్తరణకు సైతం అవకాశం ఉంటుంది అంటూ తెలియజేశారు. నా స్కామ్ కు స్వాగతం పలికేందుకు ఏపీ సిద్ధంగానే ఉందంటూ లోకేష్ తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. ఏపీలో ఐటి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్, డేటా సెంటర్ క్లస్టర్ వ్యాపారాలను సైతం విస్తృతంగా చేసుకోవచ్చు అంటూ కూడా తెలియజేశారు.

విశాఖలో AI డేటా సెంటర్కు ఏర్పాటు చేసుకోవడానికి మంచి అనుకూలమని కూడా లోకేష్ తెలిపారు. నా స్కామ్ తమ వ్యాపారాలను సైతం ఏపీకి బదిలీ చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నామంటు సూచించారు. ఆంధ్రాలో పెట్టుబడులకు అత్యుత్తమ సౌకర్యంగా ఉన్నదని అలాగే నిరంతరం విద్యుత్ మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామంటూ నారా లోకేష్ తెలియజేశారు. ఆంధ్రాలో ఐటీరంగం పూర్వ వైభవం కోసమే ఆ శాఖ మంత్రిగా నారా లోకేష్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న సంక్షోభాన్ని ఏపీకి అవకాశంగా మలుచుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు లోకేష్.

దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ సేవలు అందించి అసోసియేషన్లు సైతం కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు పైన చాలా అసంతృప్తితో ఉన్నారు. కర్ణాటకలో ఉండే ప్రైవేటు కంపెనీలలో కేవలం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలంటూ ఒక ప్రభుత్వం ఏకంగా చట్టం తీసుకురావడంతో చాలా కంపెనీలు సైతం ఫైర్ అవుతున్నారు.. లోకల్ టాలెంట్ కు కొరత ఉందని ప్రభుత్వం ఈ నిర్ణయంతో ఐటి కంపెనీలకు సైతం మరోచోటికి తరలించేలా నా స్కామ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.వెంటనే ఈ బిల్లును రద్దు చేయాలంటూ కూడా అక్కడ కంపెనీలు చాలా డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో నారా లోకేష్ ఎంట్రీ అయ్యి నా స్కామ్ ఏపీకి రావాలి అంటూ ఆహ్వానం పలికారు. మరి లోకేష్ చేసిన ఈ ట్విట్ కు నా స్కామ్ నుంచి ఎలా స్పందన వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: