వైఎస్సార్ @75 :మెగా డీఎస్సి ఘనత వైఎస్సార్ దే..!!

murali krishna
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చిరస్థాయిగా నిలిచిన రాజన్న పాలన
*ఎన్టీఆర్ తరువాత అంతటి ప్రజాదరణ పొందిన నాయకుడు వైఎస్ఆర్
* ఉమ్మడి రాష్ట్రంలో మెగా డీఎస్సి ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ దే ..
 
దివంగత నేత డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎన్టీఆర్ తరువాత అంతటి స్థాయి ప్రజాదరణ పొందిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి. 1978 లో తొలి సారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రాజశేఖరరెడ్డి ఆ తరువాత  6 సార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యే గా ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.ఇలా ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించారు.అయితే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారి కష్టాలను తెలుసుకోవడానికి 2004 ఎన్నికల ముందు ఏకంగా 1460 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు.నేను విన్నాను నేను వున్నాను అనే నినాదంతో ముందుకు సాగిన రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికలలో అద్భుత విజయం సాధించారు.ఎన్నికల ప్రచారంలో ప్రజల కష్టాలను తీర్చేందుకు ,ఉచిత కరెంటు ,ఫీజు రియంబర్స్మెంట్ ,రాజీవ్ ఆరోగ్య శ్రీ వంటి ఎన్నో పధకాలను ప్రవేశపెడతామని ఆయన హామీ ఇచ్చారు.కానీ అప్పటికి కాంగ్రెస్ అధిష్టానం రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు.తాను ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చే భాద్యత నాది అని రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు

.ప్రజలలో ఆయనకు వున్నా ఫాలోయింగ్ చూసిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.2004 కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.2004 నుంచి 2009 వరకు ప్రతి హామీని నెరవేరుస్తూ అద్భుతంగా  పాలించిన రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికలకు ముందు ఉపాధ్యాయ నిరుద్యోగులకు ఎంతగానో న్యాయం చేసారు.ఏకంగా 50000 ల పోస్టులను నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులకు ఎంతో మేలు చేసారు.ఇప్పుడు మెగా డిఎస్సి రాష్ట్రంలో బాగా వినిపిస్తుంది.అస్సలు మెగా డిఎస్సి  ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ దే అని చెప్పాలి.2008 లో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ రాలేదు.కానీ వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయాలలోకి వచ్చిన జగన్ మాత్రం ఒక్క డీఎస్సి కూడా జరపకపోవడంతో 2024 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు.ప్రస్తుతం వచ్చిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 16 ,347 ఉపాధ్యాయ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది.ఎన్నికలలో ఇచ్చిన హామీ కారణముగా చంద్రబాబు మెగా డీఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేసి ఉపాద్యాయ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: